Donald Trump Tariffs: భారతదేశ దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీన్ని ఖండిస్తున్నట్టు భారత్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇదొక దురదృష్టమైన చర్యగా పేర్కొంటూ.. దేశ ప్రయోజనాలే తమకు ప్రధానమని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ విధించిన అధిక సుంకాలను అన్యాయం, అసమంజసమైనవని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో భారత ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను చేపడతామని ప్రకటించింది.
రష్యాతో చమురు కొనుగోళ్ల వ్యాపారం చేస్తున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇదివరకే 25% సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అదనంగా మరో 25% ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికాలో 50% సుంకం వర్తిస్తుంది. ఇదే విషయమై డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.
రష్యా భారత్ మైత్రి పై అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గడిచిన 24 గంటల్లో అదనపు సుంకాలపై నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. అదనంగా విధించిన అంకాలపై భారత విదేశాంగ శాఖ ఈ విధంగా స్పందించింది.
"రష్యా నుంచి చేస్తున్న చమురు దిగుమతులపై అమెరికా లక్ష్యంగా ఈ సుంకాలను విధించినట్లు అనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే మా వైఖరిని తెలియజేశాం. మార్కెట్ అవసరాలకు ఆధారపడే ఈ దిగుమతులు జరుగుతున్నాయి. 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన అవసరాల నిమిత్తం అనేక దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి. దేశ ప్రయోజనాల కోసం ప్రపంచంలో ఏ దేశమైన చేస్తుంది ఇదే. ఈ నేపథ్యంలో అమెరికా అధిక సుంకాలను నిర్ణయించడం దురదృష్టకరం. ఈ చర్యలు అన్యాయమైనవి.. అసమాంజసమైనవి. భారత దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అంటూ భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
Also Read: Trump Tariff: భారత్‌పై మరోసారి పన్నుల బాంబ్ పేల్చిన ట్రంప్..మరో 25% పెంచేశాడు!
Also Read: Mole Astrology: ఆ భాగంపై పుట్టుమచ్చ ఉంటే రాజయోగం..మీరు ఇది చూసుకున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









