)
Trump Tariffs War on India: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన వారిపై ఇప్పుడు అతని స్వదేశంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ అధిక సుంకాల వల్ల అమెరికా ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధిక సుంకాల పేరుతో ట్రంప్ ఒక పేక మేడ కడుతున్నాడని.. అది త్వరలోనే కూలిపోతుందని ఆయన విమర్శించారు. అయితే ఇప్పట్లో ట్రంప్ జోలికి వెళ్లకపోవడం భారతదేశానికి మంచిదని ఆయన సూచించారు.
అమెరికా ఆర్థిక వేత్త స్టీవ్ హంకీ మన దేశానికి చెందిన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు . "భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాల నిర్ణయం పూర్తిగా అర్థరహితం ఎక్కడో విషయం ఏంటంటే.. "తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్ళకపోవడం మంచిదే"ననేది నెపోలియన్ చెప్పిన మాట. ఇప్పుడు ట్రంప్ తో ప్రపంచ దేశాలకు ఇదే వర్తిస్తుంది. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధం చేస్తున్న ట్రంప్ తనని తానే నాశనం చేసుకుని సమయం వస్తుందని అనిపిస్తుంది. భారతదేశ విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కొంతకాలం ఓపికతో ఉంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కదిలించకపోవడం మంచిది. ఎందుకంటే ట్రంప్ కట్టే టారిఫ్ పేక మేడ త్వరలోనే కుప్పకూలుతుంది" అని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
ఇతర దేశాల దిగుమతులపై సుంకాలు అధికంగా పెంచుతున్న నేపథ్యంలో అమెరికాను తమ వినిమయ ఖర్చులు పెరిగితే ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హాంకీ అంచనా వేశారు. డోనాల్డ్ ట్రంప్ టారీఫ్ విధానాలు పరమ చెత్తగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యాతో భారత్ వాణిజ్యం పెట్టుకుందని కారణంతో మన దేశంపై డోనాల్డ్ ట్రంప్ అధిక సంఖ్యలను విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే 25 శాతం సుంకాలను విధించిన ట్రంప్ ఇప్పుడు మరో 25 శాతాన్ని అదనంగా టారిఫ్‌లు పెంచుతూ మొత్తంగా 50% విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సుంకాల విషయం తేలే వరకు ఢిల్లీ తో అనగా మోడీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య విభేదాలు ఏర్పడినట్లు అయ్యింది. అయితే ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది అన్యాయం, అసమంజసమైనదని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామంటూ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook