Trump Bans 12 Countries: అమెరికా అధ్యక్షుడు ఎన్నిక అయినప్పటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక విషయంలో ఆయన ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఆయన తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు కొంతమందికి ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. మరో ఏడు దేశాల నుంచి వచ్చే పౌరులపై పాక్షిక ఆంక్షలు కూడా విధించారు. ప్రధానంగా అమెరికా జాతీయ భద్రత గురించి ఆందోళన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ నిషేధించిన 12 దేశాలు ఇవే..
ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, ఈక్వటోరియల్, గినియా, ఎరిట్రియా, చాద్, కాంగో, ఇరాన్, లిబియా, హైతి, సోమాలియా, సుడాన్, యెమెన్, బురుండీ, క్యూబా, లావోస్, సియోర్రా లియోన్, టోగో, తుర్కెమెనిస్తాన్, వెనిజులా దేశాలపై దాని నిషేధం విధించారు. ఇందులో ప్రధానంగా ఎక్కువ శాతం ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉండే ప్రయాణికులపై బ్యాన్ చేశాడు.
"We cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen... That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others." –President Trump pic.twitter.com/ER7nGM4TO2
— The White House (@WhiteHouse) June 4, 2025
ఈ దేశాలే ఎందుకు?
ప్రధానంగా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ చేసిన దేశాలు భద్రతా తనిఖీల్లో విఫలమయ్యాయి. స్క్రీనింగ్ విషయంలో కూడా ఫెయిలయ్యాయి. ఇది తీవ్రమైన ముప్పుగా వైట్ హౌస్ పరిగణించింది. 2017 ట్రంప్ తీసుకున్న ఈ విధానానికి పొడగింపుగా 7 ముస్లిం మెజారిటీ దేశాలు పౌరులు అమెరికా రాకుండా నిషేధించింది.
జాతీయ భద్రతే అసలు కారణం..
ఇక అమెరికా అధ్యక్షుడు జాతీయ భద్రత పౌరుల ప్రయోజనాల కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ట్రావెల్ బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ చర్యను సమర్ధించింది. డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధంలో ప్రధానంగా బి1, బి2, F, M, J వలసేతర వీసాలు కూడా వర్తిస్తుంది. వీసా ఓవర్ స్టే రేటు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమెరికా దృష్టి సారించింది.
Also Read: మాటలు రావడం లేదు.. ఈ బాధ వర్ణనాతీతం, తొక్కిసలాటపై విరాట్ కోహ్లీ ఎమోషనల్..
Also Read: తేనెతో ఈ మాస్క్ జుట్టుకు వేయండి.. పట్టులా మెరుస్తూ పెరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









