Trump Vs JD Vance: జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అదే గనక జరిగితే నేనె అధ్యక్షుడిని..

Trump Vs JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయకరమైన విషాదం చోటుచేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో జేడీ వాన్స్ కీలక‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 29, 2025, 11:23 AM IST
Trump Vs JD Vance: జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అదే గనక జరిగితే నేనె అధ్యక్షుడిని..

Trump Vs JD Vance: యూఎస్‌ టుడేతో జేడీ వాన్స్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో పనిచేసే వారిలో చాలామంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నట్లు తెలిపారు. కానీ, వారందరి కంటే చివరిగా నిద్ర పోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని వాన్స్‌ చెప్పుకొచ్చరు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయన్నారు. వాటన్నింటినీ దాటుకొని.. ట్రంప్‌ మిగిలిన తన పదవీకాలాన్ని పూర్తిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Add Zee News as a Preferred Source

ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఒకవేళ భయంకరమైన విషాదం సంసభవిస్తే.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని నిర్ధారణ అయ్యింది. 

అయితే, ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి అని, 70 దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని శ్వేత సౌధం ప్రకటించింది. ఈ క్రమంలో 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా, తన వారసుడిగా వాన్స్‌ ఉండనున్నట్లు ఇటీవల డొనాల్డ్  ట్రంప్‌ ప్రకటించారు. ఈ క్రమంలో జేడీ వాన్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఇదీ చదవండి: HBD Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..

ఇదీ చదవండి: Jr NTR Worst Record: పాతికేళ్ల సినీ కెరీర్ లో ‘వార్ 2’ తో ఎన్టీఆర్ ఖాతాలో పరమ చెత్త రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News