Trump Vs Musk: మస్క్ కి పిచ్చి పట్టింది...నేను అతనితో ఇక మాట్లాడను..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

Trump Vs Musk: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ పై మస్క్ చేసిన విమర్శలపై ట్రంప్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై మొదట్లో మస్క్ కు అభ్యంతరాలు లేవని..ఈవీ మాండేట్ రోల్ బ్యాక్ గురించి తెలిసిన తర్వాతే బిల్లును వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించారు. మస్క్ కు చాలా సహాయం చేశానని..అయినా అతనికి కృతజ్ఞత లేదని ఫైర్ అయ్యారు. తాజాగా మరోసారి మస్క్ పై ఎదురుదాడికి దిగారు ట్రంప్. మస్క్ కు మతి పోయిందని..నేను అతనితో ఇక మాట్లాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Written by - Bhoomi | Last Updated : Jun 6, 2025, 07:39 PM IST
Trump Vs Musk: మస్క్ కి పిచ్చి పట్టింది...నేను అతనితో ఇక మాట్లాడను..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

Trump Vs Musk:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కు మధ్య స్నేహం కాస్త చెడింది. మస్క్ పికల్లోతు కోపంతో ఉన్న ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ABC న్యూస్ తో జరిగిన సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ.."మస్క్ తన మతిస్థిమితం కోల్పోయాడు... నేను ఇకపై అతనితో మాట్లాడటానికి ఇష్టపడను" అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్  ఈ ఇంటర్వ్యూ శుక్రవారం ఉదయం ABC న్యూస్ చీఫ్ వాషింగ్టన్ కరస్పాండెంట్ జోనాథన్ కార్ల్ తో జరిగింది. ట్రంప్, ఎలోన్ మస్క్ మధ్య జరిగిన చర్చ అనంతరం గంటల తర్వాత ఈ ఇంటర్వ్యూ జరిగింది.

Add Zee News as a Preferred Source

"నువ్వు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు."
గురువారం నాడు జరిగిన వివాదం గురించి ట్రంప్ అస్సలు ఆందోళన చెందలేదని.. అది అతి ముఖ్యమైన విషయం కాదన్నట్లుగా ABC న్యూస్ రాసింది. ఆ రోజు మస్క్‌తో ఫోన్ కాల్ షెడ్యూల్ చేసిందా.. అని ఉదయం 7 గంటలకు ముందు అడిగినప్పుడు, ట్రంప్ ఆశ్చర్యకరంగా.. "మీరు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా?" "ఈ సమయంలో అతనితో (మస్క్) మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని" ట్రంప్ స్పష్టం చేశాడు. మస్క్ తనతో మాట్లాడాలనుకుంటున్నాడని, కానీ తాను  మస్క్‌తో మాట్లాడటానికి సిద్ధంగా లేనని  ట్రంప్ కూడా పేర్కొన్నారు.

Also Read: RBI: వావ్...హోంలోన్, గోల్డ్ లోన్ తీసుకున్నవాళ్లకు గుడ్ న్యూస్..ఈ పని చేస్తే లక్షల రూపాయలు లాభం..!!  

తాను మస్క్ కు చాలా  సహాయం చేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు  మస్క్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాను లేకపోతే ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారన్నారు. వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ ను తనకు ఒకసారి కూడా చూపించలేదని అన్నారు. కానీ దానిపై ట్రంప్ చేస్తున్న వాదనను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని ఈవీ, సోలార్ ప్రోత్సాహకాల కోతలపై అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

Also Read: RBI Interest Rates: రుణగ్రహీతలకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్..ముచ్చటగా మూడోసారి అదే నిర్ణయం..!!  

ఈమధ్య కాలంలో ఇంత పెద్ద దారుణమైన బిల్లును తాను  చూడలేదన్నారు. బిల్లులోని ఖర్చులు ద్రవ్యలోటును పెంచుతాయని..అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని మరోసారి స్పష్టం చేశారు మస్క్. ఈ వ్యాఖ్యలు ట్రంప్ సర్కార్, మస్క్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రాజకీయ, ఆర్థిక వర్గాల్లోనూ చర్చను రేకెత్తించాయి. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News