Trump Vs Zelenskyy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని డొనాల్డ్ ట్రంప్ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ వైట్ హౌస్‌కు వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన అమెరికాపై ఒత్తిడి చేశారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. దీనికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. తమ దేశంలో తాము ఉంటున్నామని, దృఢసంకల్పంతో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు. అయినా, మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలన్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉందన్నారు. జెలెస్కీ చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోందని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్‌స్కీకి హితవు పలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని నొక్కి చెప్పారు. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని మాస్ వార్నింగ్ అన్నారు.
వెంటనే వాన్స్‌కు మద్దతుగా ట్రంప్ మాటలు అందుకున్నారు. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశామన్నారు. ఆయుధాలు సమకూర్చి మద్దతుగా తెలిపామన్నారు. తమ సైనిక పరికరాలే లేకపోతే.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదన్నారు. దీని స్పందించిన జెలెన్‌స్కీ రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారన్నారు. దీంతో అవాక్కయిన ట్రంప్ ఆర్గ్యుమెంట్‌ను క్లోజ్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ తో బిజినెస్ చేయడం కష్టమని కామెంట్ చేశారు. అసలు ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలిసిందన్నారు. అసలు నిజమేంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. తాము చేసిన సాయానికి కృతజ్ఞులుగా ఉండాలని జెలెన్‌స్కీ కి హితవు పలికారు. ఉక్రెయిన్ ప్రజలు చనిపోతున్నా, సైనిక బలగం తగ్గుతున్నా కూడా జెలెన్‌స్కీ శాంతి ఒప్పందానికి కాకుండా యుద్ధనికి సై అంటున్నారన్నారు అధ్యక్షుడు ట్రంప్.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
శాంతి ఒప్పందానికి ఓకే అంటే ఉక్రెయిన్‌లో బుల్లెట్ల మోత ఆగుతుందని, మరణాలు తగ్గుతాయంటూ ట్రంప్ కాస్త తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వ నేతలను అడగండి. ఏం చెబుతారో వినండి అన్నారు. దీనికి సమాధానంగా గతంలో బైడెన్ ఉండేవారు.. అయన అంత స్మార్ట్ కాదు అంటూ ట్రంప్ బదులిచ్చారు. చివరికి జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒక వేళ శాంతి ఒప్పందం కుదరకపోతే.. అమెరికా- ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. భేటీ అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అర్థమైందంటూ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









