Trump- Zelensky: డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వైట్ హౌస్ రచ్చ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఉక్రెయిన్‌కు సాయుధ సాయం నిలిపివేసింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగొచ్చారు. ట్రంప్‌తో అలా వాగ్వార్ధం జరగడం చాలా విచారకరమని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగించడానికి తమ సిద్ధంగా ఉన్నామని.. ఇక డోనాల్డ్ ట్రంప్ లాంటి బలమైన నాయకులతో కూడా కలిసి తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే, మొదటగా శిక్షలో ఉన్న ఖైదీలు విడుదల, ఇతర వనరులు వంటి వాటిని నిషేధిస్తే రష్యాతో తాము శాంతి నెలకొల్పుతామని చెప్పారు.
అంతేకాదు అగ్రరాజ్యంతో తమ దేశం ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి తమ సిద్ధంగా ఉన్నామని ట్రంప్ కు ఎప్పుడు రుణపడి ఉంటామని ఆయన ఐరోపా దేశాధినేతల సమావేశం తర్వాత చెప్పారు.. ముఖ్యంగా వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపి వేసిన తర్వాత ఆయన ఇలా స్పందించడం గమనార్హం. ఇంకా వైట్ హౌస్ వర్గాలు కూడా మిలిటరీ సాయం నిలిపివేసిన దానిపై స్పందించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చి రష్యా తో శాంతి చర్చలు జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ నిలిపివేత తాత్కాలికమే అని పేర్కొన్నారు.
ఇటీవల ట్రంప్ తో జరిగిన చర్చలు విఫలమైనందుకు జెలెన్‌స్కీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. శుక్రవారం జరగాల్సిన సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇకపై అలా జరగకుండా చూసుకుంటాం అని ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొన్న శుక్రవారం సమావేశం వైట్ హౌస్ లో నిర్వహించారు. ఆ సమయంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సోషల్ మీడియా వేదికగా వీడియో విజువల్స్ వైరల్ కూడా అయ్యాయి.
షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
ఖనిజాల ఒప్పందం కోసం అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ, ట్రంప్ మధ్య వాగ్వాదం జరిగింది. యుద్ధకాంక్షతోనే జెలెన్‌స్కీ ఇలా చేస్తున్నారని ఆ తీవ్ర అభ్యంతరం చేశాడు ట్రంప్. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా డిక్టేటర్ షిప్ పనికిరాదని జెలెన్‌స్కీ ముఖంపైనే మండిపడ్డారు.
అయితే గతంలో జో బైడెన్ ఉన్న సమయంలో కూడా ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున నిధులతో పాటు యుద్ధ సామాగ్రిని కూడా సమకూర్చింది అమెరికా. ఈనేపథ్యంలో రష్యాకు దీటుగా ఉక్రెయిన్ పోరాటం చేయగలిగింది. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఆ నిధులను ఒక్కసారిగా నిలిపివేశాడు. ఖనిజాల ఒప్పందం కోసం వీరు ఇరువురు వైట్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జరిగిన వివాదంపై వివిధ దేశాలు కూడా భిన్నంగా స్పందించాయి. జెలెన్‌స్కీని ఒక పొగరుబోతు పంది అని అభివర్ణించింది.. అయితే ఈయూ దేశాలు మాత్రం జెలెన్‌స్కీకి సపోర్ట్ గా నిలిచాయి. ఉక్రెయిన్ ఒంటరి కాదు తామంతా అండగా ఉన్నామని స్పందించాయి.
మీడియా ఎదుటే ట్రంప్ జెలన్‌స్కీ తీవ్ర వాగ్వాదం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్కిరిబిక్కిరి, వీడియో ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









