India Pakistan War: భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ లో కౌంటర్ ఎటాక్స్ చేసింది. భారత ఎస్ 400 వ్యవస్థ క్షిపణులు, డ్రోన్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. గురువారం సాయంత్రం పాకిస్తాన్ తీవ్ర రెచ్చగొట్టే విధంగా కౌంటర్ దాడులకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ లోని ఎయిర్ స్ట్రిప్ తో సహా ఒక డజను ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యం ఫిరంగి కాల్పులు, డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు పాల్పడింది. భారత్, పాక్ యుద్ధం మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కూడా ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆసియాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టకూడదంటూ గడ్డిపెట్టారు.
అయితే భారత్ -పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో ట్రంప్ చాలా సార్లు స్పందించారు. ఇరు దేశాలకు తాను ఏవిధంగా అయినా సహాయమం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని తెలిపారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని ఆపాలని కోరారు. భారత్, పాక్ మధ్య యుద్ధం వస్తే అది చాలా భయంకరంగా ఉంటుందన్నారు.
భారత్, పాక్ రెండూ బాగా తెలుసని..వారు ఉద్రికత్తతకు ముగింపు పలకాలంటూ కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శత్రుత్వం అతి త్వరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు. రెండు దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటకు పెట్టుకుంది.
ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు పలుకుతుండటం సహించని పాక్.. భారత్ పై కయ్యానికి కాలుదువ్వింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాలపై దాడులకు యత్నించింది. అయితే భారత ఆర్మీ భారత్ చెందిన అత్యాధుని వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి వాటిని గాల్లోనే తటస్థీకరించాయి. భద్రతా వర్గాల ప్రకారం ఈ ప్రయత్నాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Also Read: Harrop Drone: ఈ ఒక్క డ్రోన్ తో పాకిస్తాన్ అంతం..మోదీ అమ్ములపొదిలో మెగా అస్త్రం
భారత్ పాక్ యుద్ధంపై మరోసారి స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆసియాలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని పాకిస్తాన్ పాడు చేయకూడదంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని లేదంటూ తాట తీస్తానంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









