)
Asim Munir: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ అయిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కు చెందిన కమాండర్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను టార్గెట్ చేసింది. అంతేకాదు ఓ ఛాలెంజ్ కూడా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునీర్ కు నిజంగా దమ్ముధైర్యం ఉంటే..మగాడు అయితే తమను ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. అంతేకాదు పాకిస్తాన్ సైన్యంలోని ఉన్నతాధికారులకు కూడా సవాల్ విసిరారు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేశాయి.
టీటీపీ సంస్థ కమాండర్ కాజిమ్ వీడియోలో మాట్లాడుతూ ..నేరుగా ఆర్మీ చీఫ్ ను ఉద్దేశించి సవాల్ చేశాడు. మాతో పోరాటం చేసేందుకు పాకిస్తాన్ కు సైన్యం ఎందుకు? సైన్యానికి బదులుగా పాకిస్తాన్ సైన్యంలోని ఉన్నతాధికారులు, యుద్ధభూమికి రావాలి. పాక్ ఆర్మీ చీప్ మునీర్ కు నిజంగా దమ్ము ఉంటే...మగాడు అయితే మిమ్మల్ని ఎదుర్కొవాలి. అతను నిజంగా తల్లిపాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయాలని అంటూ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అతని వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. ఇదే సమయంలో అక్టోబర్ 8న కేపీ ప్రావిన్స్ లో టీటీపీ జరిపిన దాడి ద్రుశ్యాలు విడుదల చేసింది.
అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కుర్రం జిల్లాలో టీటీపీ మిలిటెంట్లు పాక్ సైనిక శిబిరంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 22 మంది పాక్ సైనికులు మృతి చెందారని టీటీపీ ప్రకటించగా, పాక్ ప్రభుత్వం మాత్రం 11 మంది మాత్రమే మరణించారని తెలిపింది. తాజాగా విడుదలైన వీడియోలో ఆ దాడికి సంబంధించిన చిత్రాలను చూపిస్తూ పాక్ ఆర్మీకి టీటీపీ మరోసారి హెచ్చరిక జారీ చేసింది.
ఈ దాడి తర్వాత పాక్ ప్రభుత్వం కాజిం తలపై 10 కోట్ల పాకిస్తానీ రూపాయల బహుమతి ప్రకటించింది. మరోవైపు అఫ్గానిస్తాన్‌తో తాత్కాలిక శాంతి నెలకొన్నప్పటికీ, పాక్ సరిహద్దుల్లో టీటీపీ దాడులు కొనసాగుతుండటం పాక్ భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది.టీటీపీ 2007లో స్థాపించబడిన మిలిటెంట్ గ్రూప్. దీని లక్ష్యం పాకిస్తాన్లో షరియా చట్టం అమలు చేయించడం, అలాగే పాక్ ప్రభుత్వం అమెరికాతో కలసి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడాన్ని అడ్డుకోవడం. ఈ గ్రూప్ గత దశాబ్దంలో వందలాది ఆత్మాహుతి దాడులకు పాల్పడింది.
పాకిస్తాన్, టీటీపీ దాడులకు అఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, అఫ్గాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ “మా భూభాగం నుంచి ఎవరికీ ముప్పు ఉండదు” అని స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం టీటీపీ పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. అఫ్గాన్ సరిహద్దు నుంచి వచ్చే ఈ హెచ్చరిక పాక్ ఆర్మీకి కొత్త తలనొప్పిగా మారి, ప్రాంతీయ శాంతి భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి