
Cargo Flight Accident: హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో, దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరిన ఎమిరేట్స్ కార్గో విమానం బోయింగ్ 747-481 మోడల్ రన్‌వేపై దిగుతున్నపుడు అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ఘటనలో రన్‌వేపై ఉన్న గ్రౌండ్ వెహికల్ సిబ్బందిలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని సిబ్బంది వెంటనే రక్షించగలిగారు.
ఈ విమానాన్ని టర్కీ ఆధీనంలోని ACT ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్ నుంచి లీజు తీసుకొని నడుపుతూ ఉంది. ఘటన అనంతరం హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లోని నార్త్ రన్‌వే తాత్కాలికంగా మూసివేసింది. అయితే మిగతా రెండు రన్వేలు సాధారణ కార్యకలాపాల కోసం పనిచేస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ప్రమాదానికి కార్గో విమానంలోని అదుపు తప్పిన కారణం ప్రధాన కారణం అని భావిస్తున్నారు. అధికారులు ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన పూర్తి విచారణను ప్రారంభించారు.
???#BREAKING | NEWS ⚠️
New photo of the cargo plane that departed from Dubai and headed to Hong Kong crashed into a ground vehicle while landing at the Hong Kong International Airport in China then skid it off the runway into the sea all 4 crew members aboard were rescued The… pic.twitter.com/C7nyOK82G4— Todd Paron?????? (@tparon) October 19, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.