)
UK Sikh Woman Rape Update: యూకేకు ఆసియా ఖండం నుంచి వలసలు ఎక్కువగానే ఉంటాయి. ప్రధానంగా భారతదేశం నుంచి కూడా ఎక్కువ మంది చదువు, ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమెరికాకి వెళ్లలేని వారు కూడా యూకేకు వెళ్లి అక్కడ సెటిల్ అవుతుంటారు. అయితే ఇటీవల జాతీయ అహంకార నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు యూకేలో అది చెలరేగుతుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులపై విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న యువత వల్ల తమకు వృత్తిపరంగా భద్రతా లోపం ఏర్పడుతుంది అనే భయాందోళనతో వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగులు చూసింది. 20 ఏళ్ల సిక్కు మహిళపై ఇద్దరూ శ్వేత జాతీయవులు అత్యాచారానికి పాల్పడి.. ఆమెని తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిక్కు సమాజం ఉలిక్కిపడింది. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితులపై కఠిక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా అత్యాచారానికి పాల్పడింది శ్వేతజాతీయులే అని స్పష్టమైనది. ఒకరు భారీ కాయంతో గుండుతో ఉండగా.. మరొకరు స్వెట్ షర్ట్ ధరించి ఉన్నారు. అయితే నిందితులను పట్టుకోవడానికి వీలైనంత త్వరగా కృషి చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్టపగలే ఉదయం 8 గంటల సమయంలో పార్కులో జరగడంతో ఒక్కసారిగా భారతీయులు అంత భయాందోళనకు గురవుతున్నారు. యూకే లోని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ఓల్డ్ బరీ ప్రాంతంలో రోడ్డు వద్ద ఉన్న ఒక పార్కులో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
అయితే పోలీసులు సీపీ ఫుటేజ్ తో పాటు డాష్ క్యామ్, మొబైల్ ఫుటేజ్ వంటి ఆధారాలు కూడా తమకు అందించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై లేబర్ పార్టీకి చెందిన ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇది కచ్చితంగా జాతీయ అహంకార చర్య అని అభివర్ణించారు.
ఇక లండన్ విధుల్లో కూడా భారీ స్థాయిలో జన సమూహం గుముగూడి ప్ల కార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతున్నారు. వలస వ్యతిరేకతకు మార్చ్ చేపట్టారు. దీనికి యూనైట్ ది కింగ్డమ్ అని పేరు పెట్టి వలసలపై వ్యతిరేకతగా కార్యకర్త టామీ రాబిన్ సన్ నాయకత్వం వహిస్తున్నారు . ఈ నేపథ్యంలో 1,10,000 మంది వీధుల్లోకి ఆయన విజ్ఞప్తితో వీధుల్లోకి వచ్చారు. ప్రధానంగా వీళ్ళు వలసలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సిక్కు యువతిపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.