US Vice Presidet: భారత్ లో నాలుగు రోజులు పర్యటనలో భాగం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాసేపటి క్రితమే భారత్ కు తన సతీసమేతంగా చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. అమెరికా సెకండ్ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన భారత దేశపు ఆడపడుచు అదులో తెలుగమ్మాయి అయిన ఉషా చిలుకూరి కూడా తన భర్త ముగ్గురు పిల్లలతో కలిసి సొంత గడ్డపై అడుగుపెట్టారు.
జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరపన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నివాస ప్రాంతమైన లోక్ కళ్యాణ్ మార్క్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. అక్కడ జేడీ వాన్స్ దంపతులకు భారతీయ వంటలతో ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు జైపుర్‌లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు విజిట్ చేయనున్నారు. ఆ తర్వాత తాజ్ మహల్ తో పాటు పలు సందర్శనీయ స్థలాలను వాళ్లు వెళ్లనున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాళ్ల పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం కావడం విశేషం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో యూఎస్ కు ఉద్యోగ రీత్యా వలస వెళ్లారు. తర్వాత యేల్ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త లవ్ గా మారింది. వీరిద్దరు 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లులు ఉన్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విక్టరీ ఉష కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అమెరికా రెండో లేడీ హోదాలో భారత్‌కు విచ్చేయడం విశేషం.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









