Plane Hijack: ఎంతో కట్టుదిట్టైమైన భద్రత అని చెప్పుకునే అమెరికాలో కూడా అపుడపుడు టెర్రిరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ విమానంలో కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా.. మరో ప్రయాణికుడు అడ్డుకొని కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాఫిక్ ఎయిర్‌కు చెందిన ఓ చిన్న విమానం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కత్తితో బెదిరిస్తూ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. కొంతమంది ప్రయాణికులను గాయపర్చాడు. ఈ ఘటన సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దుండగుడి చర్యతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు దుండగుడిని నిలువరించేందుకు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు బెలీజ్ అధికారులు వెల్లడించారు.
హైజాక్‌కు యత్నించిన దుండగుడిని అమెరికాకు చెందిన అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. అతడు కత్తిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు బెలీజ్ పోలీసులు వెల్లడించారు. టేలర్‌పై కాల్పులు జరిపిన ప్రయాణికుడిని హీరోగా అభివర్ణించారు. దుండగుడి చర్యతో విమానం రెండు గంటల పాటు గాల్లో గుండ్రంగా చక్కర్లు కొట్టింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయిన విమానం నుంటి ప్రయాణికులు కిందకు దిగి బోర్డింగ్ రూమ్‌లకు పరుగెత్తారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









