)
Social Media Troll On Trump: ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇందులో అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? అనే భయాందోళన కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చినట్లు, ఇరాన్‌పై అమెరికా దాడులు చేసినట్టు మీడియా సమావేశంలో స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే శాంతి నెలకొల్పకుండా ఇలా బాంబులు వేస్తూ 'నోబెల్ శాంతి' బహుమతి కోరుకోవడం ఏంటి? అని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని ఆపకుండా దాన్ని కొనసాగేలా చేస్తూ నోబెల్ శాంతి ఆశిస్తున్నారా? అని నెటిజన్స్ ట్రంప్ ను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..
ఒకవైపు ఇజ్రాయిల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగి ఇరాన్ పై దాడి చేసింది. మూడు స్థావరాలపై దాడి చేయడంతో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ,హౌతీలు ఇచ్చిన వార్నింగ్ యూఎస్ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని ఆందోళన కూడా నెలకొంది. ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా ఇతర మిత్రులు రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుంది. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.
తగ్గకపోతే దాడులు తప్పవు..
మరోవైపు ఇరాన్ పై దాడి అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే దాడులు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది చనిపోయిన మిడిలిస్టులో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇది శాంతి సమయం అని ప్రకటించారు. ఇందుకోసం ఇజ్రాయిల్ అమెరికా ఒక టీమ్‌గా పనిచేస్తున్నట్లు ప్రకటించారు.
థాంక్యూ ట్రంప్..
యూఎస్ దాడి చేయడంతో ఎక్స్ వేధికగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నేతన్యహు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ పై ఇవాల్టి దాడులు చరిత్రలో నిలిచిపోతాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం ఏ దేశం చేయలేని పని అమెరికా చేసింది. బలం ఉంటేనే శాంతి సాధ్యం థాంక్యూ ట్రంప్.. గాడ్ బ్లెస్ అమెరికా ఇజ్రాయిల్ ఇరు దేశాల బంధం కొనసాగాలి అనే ఆయన పోస్ట్ చేశారు.
యూఎస్ దాడి ఆందోళనకు గురిచేసింది : గుటెరస్
ఇక ఇరాన్ పై అమెరికా చేసిన దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ స్పందించారు. దాడి ఆందోళనకు గురి చేసిందని శాంతి భద్రతకు ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృషి చేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు వేలాది మంది అమెరికా ఇజ్రాయిల్ పౌరులను ఇలా ఇరాన్ చంపేసింది. దీని కొనసాగనివ్వకుండా ఇలాంటి దాడులు చేస్తున్నాం ఇది చరిత్రాత్మకమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మూడు అణు స్థావరాలను పూర్తిగా సంబంధించినవి ధ్వంసం చేసామని ఆయన ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.