US Election Results:  యునైటెడ్ స్టేట్స్‌లో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ దాదాపు ముగిసింది. కొన్ని చోట్ల ఓటింగ్‌ కొనసాగుతుండగా మరికొద్దిసేపట్లో ముగియనుంది. కాగా, ఓటింగ్ జరిగిన పలు రాష్ట్రాల నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభించాయి. కెంటకీ, వెస్ట్ వర్జీనియా, ఇండియానాలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. మరోవైపు వెర్మోంట్ లో డెమోక్రటిక్ అభ్యర్థి  కమలా హారిస్  విజయం సాధించారు.అక్కడి మూడు ఎలక్ట్రోరల్ సీట్లు సొంతం చేసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా  ఎలక్షన్ ల్యాబ్ ప్రకారం, US అంతటా మెయిల్ ద్వారా ముందస్తు ఓటింగ్  ట్రాక్ చేస్తుంది. 78 మిలియన్లకు పైగా అమెరికన్లు ఇప్పటికే తమ ఓటు వేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా అధికారంలోకి రావాలంటే ప్రతి స్టేట్ లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం అవుతాయి. మొత్తం 50 రాష్ట్రాలకు ఉన్న అమెరికాలో 7 రాష్ట్రాలు మాత్రమే అధ్యక్షుడిని నిర్థారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటు బ్యాంకు ఉంటుంది. అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందినవారిదే విజయం. 


అన్నింటికే ముందుగా కెంటకీ, ఇండియానా, వెర్మోంట్లలో పోలింగ్ పూర్తయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6గంటలకు ఈ రెండు చోట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు చోట్ల డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యం కనబరిచారు. కెంటకీలో 68శాతంతో 72,945, ఇండియానాలో 57,6శాతంతో 1,77,496 ఓట్లు వచ్చాయి. 


Also Read: Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు  


కెంటకీ కమలా హ్యారిస్ కు 34,108, ఇండియానాలో 1,26,570 ఓట్లు పోల్ అయ్యాయి. కెంటకీ, ఇండియానాలో డొనాల్డ్ ట్రంప్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ రెండింటినీ తన ఖాతాల్లో వేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా డీప్ రెడ్ చెందనవి. రిపబ్లికన్లకు గట్టిపట్టున్న రాష్ట్రాలే. ఇక్కడ  ఓట్లు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. 


ఇక అటు వెర్మోంట్లో కమలా హ్యారిస్ ఖాతా తెరిచారు. తన సమీప ప్రత్యర్థి ట్రంప్ భారీ మెజారటీతో దూసుకెళ్తున్నారు. ఆయనకు అందనంత ఎత్తులో ఓట్లు తన ఖాతాలో వేసుకుంటున్నారు. కమల హ్యారిస్ కు 12,579 ఓట్లు రాగా ట్రంప్ కు 5,644ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 30శాతానిపైగా వ్యత్యాసం ఉంది. 1988 తర్వాత ఏ ఒక్క రిపబ్లికన్ అభ్యర్థి కూడా వెర్మొంట్లో విజయం సాధించలేదు. అలబామా, జార్జీయా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో పోలింగ్ చివరి దశకు చేరింది. ఇండియానాలోని గిబ్స్, జాస్ఫర్, లేక్, లాపొర్టె, న్యూటౌన్, పెర్రీ, పోర్టర్ వాండెర్బర్గ్, వార్రిక్ లల్లో పోలింగ్ ముగిసినట్లు ఎలక్ట్రోరల్ కాలేజీ తెలిపింది. 


జార్జీయా, సౌత్ కరోలినా, వర్జీనియా, ఫ్లోరిడా 7గంటలకు, నార్త్ కరోలినా, ఓహియో , వెస్ట్ వర్జీనియా 7.30గంటలకు అలబామా, కనెక్టికల్, డెలావెర్, కొలంబియా, ఇల్లినాయిస్, కన్సాస్, మేరీల్యాండ్, మిస్సిస్సిపి, న్యూజెర్సీ, ఓక్లహామా, న్యూయార్క్, కొలరాడో, రోడ్స్ ఐలండ్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ రాత్రం 8గంటలకు పూర్తవుతుంది. 


Also Read: US Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.