US TAX ON INDIA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా రెండో అధ్యక్షుడయ్యాక తొలిసారిగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ఆయన అమెరికా చరిత్రలోనే అత్యధిక సమయం మాట్లాడారు. ఈ సందర్భంగా పన్నుల విషయాన్ని తేల్చిచెప్పారు. తమ వస్తువును అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే ట్రంప్ పాలనలో సుంకాలను భరించాల్సిందే అన్నారు. కొన్ని వస్తువుల విషయంలో అది మరింత అధికంగా ఉంటుందన్నారు ట్రంప్. దశాబ్దాలుగా పలు దేశాలు అమెరికాపై పన్నులు విధిస్తూ వస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు అమెరికా సమయం వచ్చిందన్నారు. ఐరోపా దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడాతోపాటు పలు దేశాలు అమెరికాపై అత్యధిక టాక్స్‌లు విధిస్తున్నాయన్నారు. వాటితో పోలిస్తే మనం విధించేవి చాలా తక్కువే అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
ఆటోమొబైల్ రంగం విషయానికి వస్తే భారత్ 100 శాతం కంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తోందన్నారు ట్రంప్. ఈ విషయంలో తాము కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చైనా అమెరికా ఉత్పత్తులపై రెట్టింపు పన్నులు విధిస్తోందన్నారు. దక్షిణ కొరియా నాలుగు రెట్లు అధికంగా టాక్స్‌లు వసూలు చేస్తోందన్నారు. ఒక పక్కన అమెరికా దక్షిణ కొరియాకు సైనిక సాయం చేస్తున్నా సరే.. అధిక పన్నులు వసూలు చేయడం అన్యాయమన్నారు ట్రంప్. అందుకే ఏప్రిల్ 2 నుంచి తాము కూడా ఆయా దేశాలు అమెరికాపై విధిస్తున్న పన్నులకు అనుగుణంగానే తాము సుంకాలు వస్తూలు చేస్తామన్నారు
అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారత్‌లో కొన్ని రంగాలు ప్రభావితమవుతాయి. సుంకాల కారణంగా ధరలు పెరిగితే వినియోగదారులు దూరమై కంపెనీలకు నష్టం జరుగుతుందని అంచనా. రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని అంటున్నారు. ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. అది వ్యవసాయ రంగానికి నష్టం కలగజేస్తుంది.
భారత్‌ను పన్నుల రారాజుగా అమెరికా పేర్కొనడం తగదంటున్నారు ఆర్ధిక రంగ విశ్లేషకులు. మన దేశానికి అమెరికా నుంచి దిగుమతయ్యే 8,562 ఉత్పత్తుల్లో 6,500 వస్తువులపై 10 శాతం కంటే తక్కువ సుంకాలే ఉన్నాయంటున్నారు. 8,400 ఉత్పత్తులపై 20శాతం కంటే తక్కువ సుంకాలే అమలవుతున్నాయన్నారు. 216 ఉత్పత్తులపై అసలు పన్నులే లేవన్నారు. 2025-26 బడ్జెట్‌లో వాటిని 260కి పెంచినట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అమెరికా లెక్కల ప్రకారం.. 2024లో భారత్, ఆ దేశం మధ్య 129.2 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో భారత్‌కు అమెరికా దిగుమతుల వాటా 41.8 బిలియన్ డాలర్లు. భారత్ ఎగుమతుల వాటా 87.4 బిలియన్ డాలర్లు. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ వివాదానికి సామరస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది. అమెరికాతో వాణిజ్య బంధంలో తలెత్తిన సుంకాల వివాదానికి కచ్చితంగా పరిష్కారం కనుగొంటామనే ఆశాభావాన్ని భారత అధికారులు వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









