Gold Card: అమెరికన్‌ గోల్డ్‌కార్డు విడుదల చేసిన ట్రంప్‌.. ఫస్ట్‌లుక్‌ ఎలా ఉందో వీడియో చూడండి..

Gold Card Released By Trump Video: అమెరికా గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అమెరికా పౌరసత్వం పొందడానికి ఇది తప్పనిసరి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 4, 2025, 09:46 AM IST
Gold Card: అమెరికన్‌ గోల్డ్‌కార్డు విడుదల చేసిన ట్రంప్‌.. ఫస్ట్‌లుక్‌ ఎలా ఉందో వీడియో చూడండి..

Gold Card Released By Trump Video: అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు  గోల్డ్ కార్డు (Gold Card) కొనుక్కోవాలని గతంలో అధ్యక్షతరం చెప్పిన సంగతి తెలిసిందే. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. అయితే ఆ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన గోల్డ్‌ కార్డు ఫస్ట్‌ లుక్‌ను చూపించారు.

Add Zee News as a Preferred Source

ఈ గోల్డ్ కార్డును EB5 వీసాకు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. దీని అర్థం ఇన్వెస్టర్ల వీసా విధానాన్ని రద్దుచేసి దాదాపు 5 మిలియన్‌ డాలర్లు వెచ్చించే వారికి అందిస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులను తమ దేశాన్ని ఆకర్షించేందుకు ఈ కార్డును ప్రవేశపెట్టారు. వారు వచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే మన దేశీయ రూపాయిలో ఇది దాదాపు రూ.43 కోటకు పైగా ఉంటుంది. ఒక్కరోజులోనే 1000 కార్డులు కూడా విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్‌ లుట్నిక్ చెప్పారు. అంటే దీని ద్వారా అమెరికా దాదాపు 5 బిలియన్ డాలర్లు సేకరించింది.

5 మిలియన్‌ డాలర్లతో ఈ కార్డును సొంతం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అయితే దాన్ని మొదటగా ట్రంప్ కొనుక్కున్నారు. ఇలాంటి ప్రోగ్రాంలో వల్ల మోసాలు అక్రమ రవాణాలు అడ్డుకట్ట వేయవచ్చని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధంగా పెట్టుబడుదారులు శాశ్వత నివాసం కూడా కల్పించనున్నారు. 1990లో EB5 వీసా విధానాన్ని అమెరికా తీసుకువచ్చింది.  కొన్ని వేల మంది ఇన్వెస్టర్లు వీసాలను పొందారు. ఆ తర్వాత 2022లో కొన్ని మార్పులు చేశారు. తాజాగా డోనాల్డ్ ట్రంప్ EB5 ఫైవ్ విధానాన్ని గోల్డ్ కార్డు ద్వారా మళ్లి ప్రవేశపెట్టారు.

 

 

ఇక ఈ ప్రెస్ మీటింగులో అమెరికన్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇదేంటో మీకు తెలుసా ?అని తన ఒక కార్డును చూపించాడు. అది చూపిస్తూ ఇది గోల్డ్ కార్డు.. ట్రంప్ కార్డు.. ఐదు మిలియన్లతో దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.రానున్న రెండు వారాల్లో పూర్తిస్థాయిలో ఈ కార్డు అందుబాటులోకి రానుందని చెప్పారు. ఆయన సిగ్నేచర్ కూడా కార్డుపై ఉంటుంది. అయితే ఇటీవలే ట్రంప్ రెసిప్రోకల్‌ ట్యాక్స్‌ విధానం కూడా అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలపై సుంకాలను అధికంగా మోపారు. ఈ నేపథ్యంలో భారత్ పై 26 శాతం అధికంగా పన్ను విధించిన సంగతి తెలిసిందే.

READ ALSO:  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ ఐర్లాండ్‌.. భారత్‌ స్థానం ఎంతకి పడిపోయిందంటే?

READ ALSO: Almonds VS Walnuts: నానబెట్టిన బాదం లేదా వాల్నట్స్‌ రెండిట్లో ఏది బెట్టర్ ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News