Protest Against Donald Trump: దేశవ్యాప్తంగా ట్రంపు పాలనపై వ్యతిరేకత మిన్నంటుతోంది. అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం విధానాలు, నిర్ణయాలపై ఆ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. దీంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.. పౌర హక్కులు, కార్మిక సంఘాలు ప్రధానంగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, భారీగా ఉద్యోగాలను తొలగించడం పై ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సలహాదారు అయిన ఎలా మాస్కులపై వ్యతిరేకత శనివారం అమెరికా అంతట నిరసనలు జరిగాయి.
పెద్ద సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శనలు వీధుల్లో ఇచ్చారు. అయితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయాలను సైతం మూసివేయడం, వలసదారులను బహిష్కరించడం, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తుల రక్షణ లను తగ్గించడం ఇవి ప్రధానంగా నిరసనకారుల్లో వ్యతిరేకతకు కారణం. రాయిటర్స్ ప్రకారం శనివారం వందలాది మంది ప్రజలు డోనాల్డ్ ట్రంప్, మస్కులకు వ్యతిరేకంగా ఇలా ప్రదర్శనలు చేపట్టారు. ప్రధానంగా వాళ్లు 'హాండ్స్ ఆఫ్' అనే ప్లకార్డులను పట్టుకొని తమ నిరసనలు పెద్ద ఎత్తున తెలిపారు.
“Hands Off” protest against Trump and Musk on the National Mall. pic.twitter.com/7vCUENGyEI
— Alejandro Alvarez (@aletweetsnews) April 5, 2025
అయితే ఈ నిరసనకారుల్లోని ఓ వ్యక్తి మాత్రం ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల దేశం నాశనం అవుతుందని తెలిపాడు. ప్రధానంగా పశ్చిమ కూటములు నాశనం చేయడానికి, పుతిన్ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు ట్రంప్ కానీ, అది అమెరికాని ఒంటరిగా చేస్తోందని వాపోయాడు. అయితే ఈ శనివారం బెర్లిన్, పారిస్ తో సహా యూరప్‌లోని అనేక నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. జర్మనీలో ఫ్రాంక్ స్పోర్ట్స్ లో జరిగిన ఈ నిరసనల్లో విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులు నిరసనలు నిర్వహించారు. ఇక బెర్లిన్ లోని టెస్లా షోరూమ్ ముందు కూడా నిరసన జరిపారు. లండన్ లో కూడా ట్రంపు మాస్కులకు వ్యతిరేకంగా బ్యానర్లతో నిరసనకారులు ప్రదర్శించారు. అంటే యూరోపియన్ దేశాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్.. వరుసగా 12, 13, 14 తేదీల్లో స్కూళ్లు బంద్..!
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








