)
Ganesh Chaturthi 2025 In Pakistan: భారతదేశంలో గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. అయితే ముస్లిం దేశంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్‌లోనూ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. మన దాయది దేశమైన పాకిస్థాన్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్న కొంకణి మరాఠీ సమాజానికి చెందిన హిందువులు వినాయక చవితి రోజున గణేశునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో కరాచీ మొత్తం 'గణపతి బప్పా మోర్యా', 'జైదేవ్-జైదేవ్' అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. దీని వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. భారతీయ హిందువులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని తమకు (పాకిస్థాన్‌లోని హిందువులకు) శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కరాచీలోని రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని గణేష్ మఠం, స్వామినారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు. సాంస్కృతిక కార్యక్రమాలను వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరొక వీడియోలో కరాచీలోని స్వామినారాయణ్ ఆలయంలో బాలీవుడ్ చిత్రం 'అగ్నిపథ్' లోని 'దేవా శ్రీ గణేశ' పాటకు హిందూ యువకుల బృందం ఉత్సాహంగా నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు.
గణేష్ చతుర్థి నాడు భక్తిశ్రద్ధలతో నిండిన కరాచీ
ఈ అందమైన వీడియోలను పాకిస్థానీ ఇన్స్టాగ్రామ్ యూజర్లు షేర్ చేశారు. ఈ వీడియోలు ముఖ్యంగా భారతీయ ఇన్స్టాగ్రామ్ యూజర్ల మనసులను దోచేశాయి. ఈ వైరల్ వీడియోలపై నెటిజన్లు ప్రేమను కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook