
Night Club Roof Top Collapsed Video: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగాలో నిన్న నైట్ క్లబ్లో పైకప్పు కూలీ 184 మంది వరకు చనిపోయారు. ఇందులో మరో 145 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నైట్ క్లబ్ ప్రమాదానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే బాడీలను కుటుంబాలకు అందించడంలో ఆలస్యం అవుతూ కాస్త గందరగోళం కూడా నెలకొంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో సమస్య ఎదురవుతుందని అధికారులు చెబుతున్నారు.
మంగళవారం నైట్ క్లబ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఈ ప్రమాదంలో చనిపోయారో సరిగ్గా తెలియడం లేదు. లోకల్ మీడియా రిపోర్టు ప్రకారం 500 నుంచి 1000 మంది వరకు ఈ నైట్ క్లబ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 12:44 ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ క్లబ్ కెపాసిటీ కేవలం 700 మాత్రమే.. మరి 1000 మంది వరకు ఎలా అనుమతించారో తెలియడం లేదు. ఈ ప్రమాదంలో పాపులర్ సింగర్, ఒక గవర్నర్, ఇద్దరు బేస్‌బాల్ ప్లేయర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో డొమినికన్ సింగర్ రబ్బి పెరేజ్ స్టేజ్ పైన పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఆ సమయంలోనే రూఫ్ టాప్ విరిగి పడిపోయింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా ఉరుకులు, పరుగులు తీస్తు కేకలు వేశారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు పైకప్పు కూలిన సమయంలో వారంత భూకంపం వచ్చిందేమో అనుకున్నారట. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కానీ శిథిలాలు ఎక్కువ స్థాయిలో పేరుకుపోవడంతో కాస్త ఆలస్యం అవుతుంది. అయితే స్టేజ్ షో నిర్వహించిన పేరేజ్ కూతురు జిలింకా ప్రకారం ఇంకా ఆయన బతికే ఉన్నారని తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనలో చనిపోయింది ఎక్కువ మంది రాజకీయ నేతలు, క్రీడాకారులని తెలుస్తోంది. శిథిలాల తొలగింపులో 370 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. శిథిలాలను తొలగించడంలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టీల్ ఉండడంతో ఆలస్యం అవుతుంది. వాటినే కట్ చేస్తూ బతికున్న వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ డెడ్ బాడీలో కూడా తొలగించే పనిలో ఉన్నారు. క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు. ఇక బాధిత కుటుంబ సభ్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. తమవారి కోసం వెతుకుతూ ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలో అలుముకున్నాయి. ప్రెసిడెంట్ అభిందర్ కూడా ఘటన స్థలాన్ని చేరుకొని ఆరా తీశారు. అయితే ఈ క్లబ్ మాత్రం 50 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం వరకు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రత్యేక డాన్సులు వంటివి నిర్వహిస్తారు. రిపబ్లిక్ అనేది హైతితో హిస్పానియోలో అనే ఐలాండ్ షేర్ చేసుకుంటుంది. 11 మిలియన్ల టూరిస్టులు 2024లో సందర్శించారు అని టూరిజం అధికారిక మంత్రి తెలిపారు. టూరిజం ద్వారా ఈ దేశం 15% జీడిపిని పొందుతుంది. ఇక్కడ కరేబియన్ దీవులు, మ్యూజిక్, నైట్ లైఫ్ ఎంతో ప్రత్యేకం.
?? The death toll from a nightclub roof collapse in #SantoDomingo, Dominican Republic, has risen to 79. pic.twitter.com/9kxZF2q1Cn
— Hamdan News (@HamdanWahe57839) April 9, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe