Eswatini King: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. ఆఫ్రికాలోని చిన్న దేశం అయిన ఎస్వాటిని (మునుపటి స్వాజిలాండ్) రాజు ఎంస్వాటి III తన భార్యలు, పిల్లలు, సేవకులతో కలిసి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజు ఎంస్వాటి III ఒక ప్రైవేట్ జెట్‌నుంచి దిగుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన వెనుక వరుసగా 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, అలాగే దాదాపు 100 మంది సేవకులు ఉన్నారు. రాజు సాంప్రదాయ చిరుతపులి చర్మ డిజైన్ తో ఉన్న వస్త్రాలు ధరించగా, ఆయన భార్యలు రంగురంగుల ఆఫ్రికన్ దుస్తులతో మెరిసిపోయారు.
ఈ భారీ రాయల్ కాన్వాయ్ రాకతో అబుదాబి విమానాశ్రయంలోని మూడు టెర్మినల్స్ తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల రీత్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1986 నుండి అధికారంలో ఉన్న రాజు ఎంస్వాటి III ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజులలో ఒగరుగా ఉన్నారు. ఆయనకు 15 మంది భార్యలు, 35 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి సొభుజా II మాత్రం 125 మంది భార్యలు, 210 మంది పిల్లల తండ్రిగా చరిత్ర సృష్టించారు.
Also Read: Benjamin Netanyahu: మనమే గెలిచాం.. నెతన్యాహు సంచలన ప్రకటన.. ఇందులో నిజమేంత..?
ప్రతి సంవత్సరం జరిగే ‘రీడ్ డ్యాన్స్’ అనే సంప్రదాయ ఉత్సవంలో రాజు తనకు కొత్త వధువును ఎంచుకుంటారని చెబుతారు. అయితే రాజు వైభవం వెనుక దేశంలోని పేదరికం, అసమానతలు, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలు దాగి ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఎస్వాటిని దేశంలో దాదాపు 60 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజు కాన్వాయ్ మొత్తం గ్రామంలా ఉంది! అంటూ వినియోగదారులు చమత్కరించగా, కొందరు దేశం కష్టాల్లో ఉంటే రాజు ఇలా సుఖసౌకర్యాల్లో ఎలా ఉంటాడు? అంటూ విమర్శలు గుప్పించారు.
రాజు ఎంస్వాటి III యుఏఈ పర్యటనకు వచ్చినది ఆర్థిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు గురించి చర్చించడానికే. అయితే ఆయన అట్టహాసమైన రాక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆయనపై మళ్లీ దృష్టి సారించింది.
Also Reas: Putin Warning: భారత్ ను అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.. అమెరికాకు పుతిన్ మాస్ వార్నింగ్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.









