మేము మీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోం: చైనా

భారత్, చైనా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక రక్షణ వ్యవహారాల సంబంధిత సహకారాల సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెరమీదికొచ్చాయి. 

Updated: Oct 24, 2018, 01:10 PM IST
మేము మీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోం: చైనా

భారత్, చైనా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక రక్షణ వ్యవహారాల సంబంధిత సహకారాల సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెరమీదికొచ్చాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం నేత పరేష్ బరువాకి చైనా ఆశ్రయం ఇవ్వడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. అయితే తాము ఇతర దేశాల అంతర్గత సమస్యల విషయంలో జోక్యం చేసుకోమని.. కనుక తమకు ఈ డిమాండ్ వర్తించదని చైనా తెలిపింది. ఈ సమావేశంలో భారత్ తరఫున హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ హాజరవగా.. చైనా తరఫున ఆ దేశ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి మరియు స్టేట్ కౌన్సిలర్ జోవో కేజీ హాజరయ్యారు.

ఈ సమావేశంలో భారత్ అధికారులతో.. చైనా అధికారులు పలు విషయాలు చర్చించారు. ఇదే క్రమంలో పరేష్ బరువాకి ఆశ్రమం ఇవ్వకూడదని భారత్ తెలిపింది. అయితే ఇతర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోరాదని తెలిపే చైనా పాలసీలలో ఎలాంటి మార్పులు ఉండవని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హుఆ చున్యింగ్ తెలిపారు. భారత్ ఈ మధ్యకాలంలో బరువా విషయంలో పదే పదే చైనాకి హెచ్చరికలు జారీ చేస్తోంది. బరువా చైనా నుండి అక్రమ ఆయుధాలను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తోంది. 

అదే విధంగా జైషే ఏ అహ్మద్ టెర్రరిస్టు గ్రూపు నాయకుడు మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రిరిస్టుగా పరిగణించాలని కోరుతూ ఐక్యరాజసమితికి భారత్ దరఖాస్తు పెట్టుకున్న సందర్భంలో.. తమకు మద్దతు ఇవ్వాలని కూడా భారత్ చైనాను  కోరింది. ప్రస్తుతం భారత్‌లో 1999లో జరిగిన కాందహార్ ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాక్ సంఘటనతో పాటు 2016లో జరిగిన పఠాన్ కోట్ ఘటనకు సంబంధించి అజహర్ పై ఆరోపణలు ఉన్నాయి. అయితే చైనా ఈ విషయంలో  భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కబెడుతోంది.