India Pakistan ceasefire: ఈ 48 గంటల్లో ఏం జరిగింది? భారత్, పాక్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాయి.. అసలు మర్మమేంటీ?

India Pakistan ceasefire: భారత్,  పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. గత 48 గంటల్లో ఇరు దేశాల నాయకుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అసలీ 48 గంటల్లో ఏం జరిగింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అందుకే అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : May 10, 2025, 08:05 PM IST
India Pakistan ceasefire: ఈ 48 గంటల్లో ఏం జరిగింది? భారత్, పాక్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాయి.. అసలు మర్మమేంటీ?

India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ దాదాపు యుద్ధం అంచున నిలబడ్డాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భీకర దాడులకు పాల్పడ్డాయి. కానీ ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ప్రకటించలేదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం..పాక్ మెడలు విరిచేలా చేసింది. భారత్ తో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని గ్రహించిన పాకిస్తాన్..అమెరికాతో రాయబార సందేశాలను నడిపించడం ప్రారంభించిందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత 48గంటల పాటు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నించారు. 48 గంటలపాటు చర్చలు జరిగిన తర్వాతే భారత్, పాక్ కాల్పుల విమరణకు అంగీకరించినట్లు  ఎవరితో  చర్చలు జరిగాయని  అమెరికా విదేశాంగ మంత్రి చెప్పారు. అసలీ కాల్పుల ఒప్పందంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి. ఇరు దేశాలు ఎందుకు అంగీకరించాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

గత 48 గంటల్లో, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, భారత్ , పాక్   ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ,  షాబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్,  అసిమ్ మాలిక్ వంటి సీనియర్ భారత, పాకిస్తాన్ అధికారులతో మాట్లాడామని మార్కో రూబియో చెప్పారు. భారత్,  పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని,  తటస్థ వేదిక వద్ద విస్తృత శ్రేణి అంశాలపై చర్చలు ప్రారంభించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని వెల్లడించారు. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాన మంత్రులు మోదీ షరీఫ్ ల జ్ఞానం, వివేకం,  రాజనీతిజ్ఞతను మేము అభినందిస్తున్నాము అంటూ పేర్కొన్నారు.

Also Read:  Mudassar Khadian Khas: గ్లోబల్ టెర్రరిస్ట్.. మర్కజ్ తోయిబా ఇన్ చార్జ్ ముదస్సర్ ఖాన్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్  

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ నడ్డివిరించింది. అదను చూసి పాక్ తలపై గురిపెట్టింది భారత్. ఉగ్రవాదుల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మెరపుదాడులు చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ కు భారత్ పవర్ ఏంటో చూపించింది. భారత్ ప్రతీకార దాడులతో ఒక్కసారిగా షాక్ అయిన పాకిస్తాన్..భారత్ పై ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. కవ్వింపుచర్యలకు దిగింది. భారత్ పై దాడికి యత్నించింది. కానీ భారత బలగాలు సమర్ధంగా అడ్డుకున్నాయి. సింహం ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు అర్థమైంది. 

దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికాను మధ్యవర్తిత్వంగా చేర్చుకుంది. భారత్ దెబ్బకు కనుమరుగవ్వడం ఖాయమని భావించిన పాకిస్తాన్.. ఎలాగైనా కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకునేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చింది.  దీంతో అగ్రరాజ్యం అమెరికా భారత్ పాక్ ల మధ్య సయోధ్య కుదుర్చడానికి దాదాపు 48గంటల పాటు చర్చలు జరిపింది. సాధారణంగానే భారత్ శాంతిని కోరుకుంటుంది. అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఓ షరతు పెట్టింది. భారత్ పై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా పరిగణించి తదనుగుణంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణపై ఆర్మీ అధికారి రవినాయర్ మాట్లాడారు. విదేశాంగ కార్యదర్శి చెప్పినట్లుగా సముద్రం, భూమి, వాయు అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేసేందుకు ఒప్పందం కుదిరింది. భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం దీన్ని అనుసరించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. 

పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను భారత్ పై ఇక నుంచి సహించబోదని ప్రభుత్వ నిర్ణయం స్పష్టం చేసింది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రదాడులను విరమించుకోకపోతే భారత్ దాన్ని యుద్ధంగా భావించి కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 22న పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. భారత పర్యాటకులను తమ మతాన్ని అడిగి మరీ కాల్చి చంపారు. దీని కారణంగానే దేశవ్యాప్తంగా పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News