Hafiz Muhammed Jameel: హఫీజ్ మహ్మద్ జమీల్ (Hafiz Muhammad Jameel) పాకిస్తాన్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఇతడు 2025 మే 7న భారత సైన్యం నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్"లో హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా (LeT)., జైష్-ఎ-మహ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థల కీలక నాయకులు లక్ష్యంగా మారారు. ముఖ్యంగా ఇతను బహబల్పూర్ లోని బహావల్‌పూర్‌లోని మార్కజ్ సుభాన్ అల్లాహ్ కు ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. మౌలానా మసూద్ అజహర్ కు దగ్గరి బంధువు.
హఫీజ్ జమీల్ జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ప్రణాళిక చేయడంలో, ఆయుధ శిక్షణ. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే జైషే మహమ్మద్ కు చెందిన నిధుల సేకరణలో కూడా ఇతడు ఎంతో కీలక పాత్ర పోషిస్తాడు. భవహల్పూర్ లోని ఉగ్రవాద శిక్షణా శిబిరానికి ఇతడే ఇంచార్జ్. ఇక్కడనే ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తారు. ఈ కేంద్రంలోని ముంబై పై దాడి జరిపిన అజ్మల్ కసబ్ కూడా శిక్షణ పొందాడని చెబుతుంటారు.ఆపరేషన్ సింధూర్ దాడుల్లో హఫీజ్ జమీల్ సహా పలువురు ప్రముఖ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ చర్యలు ఉగ్రవాద సంస్థల స్థావరనాలను ధ్వంసం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడంలో కీలకంగా మారాయి.
హఫీజ్ జమీల్ వంటి ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులు హాజరైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు ఉన్న మద్దతును సూచిస్తుంది. హఫీజ్ మహ్మద్ జమీల్ వంటి వ్యక్తుల హతం భారతదేశ భద్రతకు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఒక ముఖ్యమైన విజయం అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.