Mudassar Khadian Khas: ఆపరేషన్ సింధూర్ దాడిలో మృతి చెందిన వారిలో అత్యంత కీలకమైన ఉగ్రసంస్థలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. వీరిలో అత్యంత హై ప్రొఫైల్ కలిగిన గ్లోబల్ టెర్రరిస్ట్ మార్కజ్ తోయబా ఇంచార్జ్ ముదసర్ కడియాస్ ఖాన్ అలియాస్ అబూ జుందాల్ కూడా ఉన్నారు. ఈ గ్లోబల్ టెర్రరిస్ట్ మురిడ్కెలో జరిగిన క్షిపణి దాడిలో మృతి చెందగా అతడికి పాకిస్తాన్ ఆర్మీ అత్యంత గౌరవ మర్యాదలతో అంత్యక్రియలకు గౌరవ వందనం అందించింది. అంతేకాదు ఇతని మృతిపై పాక్ ఆర్మీ చీఫ్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి, నవాజ్ నుంచి పుష్పగుచాలు సైతం సమర్పించారు.
ఇతడి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉంచి జనానా నమాజ్ చదివారు. అలాగే ఈ అంత్యక్రియలకు ఒక సర్వీసింగ్ లెఫ్ట్ హ్యాండ్ జనరల్ అలాగే పంజాబ్ పోలీస్ ఐజి కూడా అంత్యక్రియల ప్రార్ధన సభకు హాజరయ్యారు. ఇతను లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైన వ్యక్తి, హఫీజ్ సయీద్ కు కుడి భుజం. ముదస్సర్ ఖాన్ భారతదేశంలో జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి. ఈ దాడిలో 2019 ఫిబ్రవరి 14న 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.ముదస్సర్ ఖాన్ పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కావడంతో, భారత భద్రతా సంస్థలు అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.