Yemen Boat Tragedy: ఘోర పడవ ప్రమాదం.. 68 మంది పైగా మృతి..

Yemen Boat Tragedy: మధ్య ప్రాచ్య దేశమైన యెమన్ లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో పడవ బోల్తా పడటంతో 68 మంది పైగా మృతి చెందినట్టు సమాచారం.   

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 4, 2025, 10:37 AM IST
Yemen Boat Tragedy: ఘోర పడవ ప్రమాదం.. 68 మంది పైగా మృతి..

Yemen Boat Tragedy: ఎడారి దేశమైన యెమన్ లో పడవ బోల్తా పడటంతో 68 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సముద్రంలో అల్లకల్లోకం ఏర్పడింది. దీంతో అలలకు యెమన్ సముద్ర జలాల్లో ఉన్న బోటు ఒక్కసారి తిరగబడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంత సముద్రంలో పడిపోయారు. అందులో 68 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు 74 మంది జాడా తెలియరాలేదు. వాళ్లంత సముద్రంలో కొట్టుకుపోయినట్టు చెబుతున్నారు. కొట్టుకు పోయినవాళ్లలో ఎవరు బతికే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ పడవలో మొత్తంగా 154 మంది ఆఫ్రియా దేశమైన ఇథియోపికకు చెందిన ప్రజలు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన సమాచారాన్ని యెమన్ లోని ఇంటర్నేషలన్ వలస సంస్థలకు చెందిన అధికారి ఎసోయోవ్ కాస్త ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. ఈ పడవ ప్రమాదంలో 12 మంది ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. 

Add Zee News as a Preferred Source

ప్రాణాలతో బయటపడ్డ 12 మందిలో 11 మంది ఇథియోపియన్ జాతి వాళ్లున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరోవైపు ఒకరు యెమన్ దేశానికి చెందినవారు ఈ బోటు ప్రమాదం నుంచి బయటపడ్డారు. చాలా మంది ఆచూకి తెలియరాలేదు. ఇక ఐక్యరాజ్యసమితికి చెందిన సైన్యం సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఐతే సముద్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలు సరిగా సాగడం లేదు. సముద్రంలో ఒక్కసారిగా గాలి దుమారం లేవడంతో బోటు ఒక్కసారిగా తలికిందులు అయినట్టు ఈ ప్రమాద ఘటనలో బయటపడ్డ వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ భయానక ఘటనలో తమకు కావాల్సిన వాళ్లు కళ్ల ముందే కొంత మంది మునిగిపోవడం.. మరికొందరు కొట్టుకుపోయారని.. మరికొందరు ఆచూకి గల్లంతు అయిందని వారు ఆ భయానక సంఘటన తలుచుకొని విలపిస్తున్నారు. అయితే 154 మంది ఇథియోపియన్ చెందిన ప్రజలతో కూడిన ఈ పడవ ఆదివారం తెల్లవారఝామున దక్షిణ యెమన్ లో ని అబ్యాన్ ప్రావిన్స్ లోని అడెన్ గల్ఫ్ లో మునిగిపోయినట్టు సమాచారం. వీళ్లంత అక్రమంగా వలస వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతుతున్నారు. 

హార్నర్ ఆఫ్ ఆఫ్రియా, యెమన్ మధ్య సముద్ర మార్గం అత్యంత ప్రమాదకరమైన ప్రదేశధంగా ఇంటర్నేషన్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM)పలు మార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ మార్గం షార్ట్ కట్ కావడంతో చాలా మంది ఇథియోపియా, సోమాలియా, సూడాన్, ఇతర ఆఫ్రికా దేశాలకు చెందిన అక్కడ ప్రజలు  రోజు కూలీ కోసం ఈ ప్రమాదకర మార్గంలో అక్రమంగా పడవల ద్వారా అరేబియా సహా ఇతర ఓపెక్  దేశాల్లో డంకీ రూట్ గుండా పని కోసం వస్తుంటారు. తక్కువ రేటుకు పనిచేస్తుంటారని ఇక్కడ కన్ స్ట్రక్షన్ సహా ఇతర పనులకు సంబంధించిన కాంట్రాక్టర్స్  ఈ మార్గంలో ఇలాంటి వాళ్లను తరలిస్తుంటారు. పేదరికం, ఇతరత్రా సమస్యలు అధికంగా ఉన్న మూలానా అక్కడ ప్రజలు పనుల కోసం ఆయా దేశాలకు ఇలాంటి ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఇక సముద్ర ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐక్యరాజ్య సమితి ఎక్స్ క్రేషియా చెల్లిస్తుందా లేదా అనేది చూడాలి. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో 2023,2024 సంవత్సరాల్లో ఈ మార్గం గుండా దాదాపు లక్ష మంది పైగా అరేబియా ఇతర దేశాలకు పనుల కోసం అక్రమంగా ప్రవేశించినట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. 

ఇదీ చదవండి: కూలీ’ కంటే ముందు రజినీ, నాగ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ.. పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు..

ఇదీ చదవండి: అప్పట్లో బి సరోజా దేవి.. ఇప్పట్లో సమంత ఆ అవమానాన్ని ఎదుర్కొన్నవారే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News