WHO: ఆ భ్రమలు తొలగించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..
ప్రపంచ మానవాళిని కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి స్వరూపం అర్ధం కాక తలమునకలవుతున్నారు. కాగా కోవిడ్ -19 నుండి కోలుకున్న యాంటీబాడీ కలిగి ఉన్న వ్యక్తులు, వాటిని సంక్రమింపజేసి
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి స్వరూపం అర్ధం కాక తలమునకలవుతున్నారు. కాగా కోవిడ్ -19 నుండి కోలుకున్న యాంటీబాడీ కలిగి ఉన్న వ్యక్తులు, వాటిని సంక్రమింపజేసి రక్షించబడ్డారని అనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ వ్యాధికి యాంటీ బాడీ ఉన్న వ్యక్తులకు రోగనిరోధక శక్తి పాస్పోర్ట్, రిస్క్-ఫ్రీ సర్టిఫికేట్ జారీ చేయవచ్చని కొన్ని ప్రభుత్వాలు సూచించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకత్వం ఇచ్చింది. వారు సురక్షితంగా ఉన్నారనడానికి గాని ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.
Also Read: ప్రజల వద్దకే 'కరోనా' ఆస్పత్రి..!!
ఒకవేళ ఇటువంటి భ్రమలను ప్రభుత్వాలు తొలగించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మార్గదర్శకత్వాన్ని విస్మరిస్తే వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం చాలా దేశాలు యాంటీబాడీస్ కోసం పరీక్షిస్తున్నప్పటికీ, ఈ అధ్యయనాలు వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తులు రోగనిరోధక శక్తిని పొందుతారో లేదోనని, వాటికి స్పష్టమైన ఆధారాలు లేవని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..