Zelenskyy: అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీల మధ్య మీడియా ఎదురుగానే వాగ్వాదం జరిగింది. దీంతో అగ్రరాజ్యంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం చేసుకోకుండానే జెలెన్ స్కీ వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ఆయన తన దేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అందులో ఉక్రెయిన్ ఆవేదనను వినాలని ప్రపంచ దేశాలను కోరారు. తమ గళాన్ని వినడం, మర్చిపోవద్దన్నారు. ఉక్రెయిన్ లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తుంచుకోవడం ముఖ్యమన్నారు. తమ ఆలోచనలు, ఆసక్తులను ప్రతిదేశం గుర్తిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు జెలెన్ స్కీ.
శుక్రవారం ఓవల్ ఆఫీసులో ట్రంప్ నకు జెలెన్ స్కీకి మధ్య జరిగిన ఘర్షణలో అమెరికా ఐరోపా దేశాల సంబంధాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ చర్చపై ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల అధినేతలు సోషల్ మీడియాల్లో స్పందించారు. కీవ్ ఒంటరి కాదంటూ జెలెన్ స్కీకి అండగా నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు దేశాధినేతలు అమెరికా తీరును తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. వారు తమకు అందిస్తున్న సంఘీభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: Gold Rate Today: ఇంతకంటే శుభవార్త ఏముంటుంది..మళ్లీ తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం జరిగింది. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే లేదంటే మీ దాది మీరు చూసుకోండి అంటూ ట్రంప్ జెలెన్ స్కీకి తెగేసి చెప్పారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్ఫించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ ను ఒత్తిడి చేశారు. దీంతో అమెరికాతోపాటు ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం నెలకొనడంతో జెలెన్ స్కీ సమావేశం నుంచి బయటకు వచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









