Central Election commission: థాక్రే వర్గానికి షాక్, షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీగా గుర్తించిన ఎన్నికల కమీషన్

Central Election commission: మహారాష్ట్రలో ఊహించని అనూహ్య పరిణామం. మహారాష్ట్రీయుల ఉనికిని దశాబ్దాలుగా కొనసాగిస్తూ రాజకీయాల్లో తీరుగులేని శక్తిగా మారిన శివసేన వ్యవస్థాపకులకు కోలుకోలేని షాక్. పార్టీ స్థాపించిన థాక్రే వర్గానికి గట్టి దెబ్బ. 1966లో బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీపై ఆ కుటుంబం పట్టు కోల్పోయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2023, 11:29 PM IST
Central Election commission: థాక్రే వర్గానికి షాక్, షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీగా గుర్తించిన ఎన్నికల కమీషన్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమిది. 56 ఏళ్ల తరువాత పార్టీ స్థాపించిన కుటుంబం పార్టీపై పట్టు కోల్పోయిన అనూహ్య పరిణామం ఇది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శివసేన థాక్రే వర్గాన్ని కాదని..చీలిక వర్గమైన ఏక్‌నాథ్ షిండే వర్గానిదే శివసేన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి కూటమిని వ్యతిరేకిస్తూ 2022 జూన్ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే బయటికి వచ్చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టి..బీజేపీ సహాయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం నడుస్తోంది. అప్పటి నుంచి శివసేన పార్టీ గుర్తింపు కోసం థాక్రే వర్గం వర్సెస్ షిండే వర్గం న్యాయపోరాటానికి దిగాయి. గత 8 నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల కమీషన్ తెరదించింది. శివసేన పార్టీ గుర్తు విల్లు బాణంను షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఇది నిజంగానే మింగుడుపడని పరిణామం.

ఈసీ నిర్ణయంపై థాక్రే సీరియస్

శివసేన చీలికవర్గం నేత ఏక్‌నాథ్ షిండేదే అసలైన శివసేన అని..ఎన్నికల గుర్తు విల్లు బాణంను ఆ ఆ వర్గానికే కేంద్ర ఎన్నికల కమీషన్ కేటాయించడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే..ఎవరైనా సరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం అవుతారని మండిపడ్డారు. షిండే వర్గానికి చెందినవారు ముందుగా బాలాసాహెబ్‌ను అర్ధం చేసుకోవాలని కోరారు. మహారాష్ట్రలో మోదీ పేరు పనిచేయనందున..స్వలాభం కోసం బాలాసాహెబ్ ముసుగులో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా అని విమర్శించారు. 

ఏక్‌నాథ్ షిండే వర్గం విల్లు బాణం గుర్తును దొంగిలించిందని..ప్రజలే దీనికి ప్రతీకారం చెబుతారని థాక్రే తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని సుప్రీంకోర్టు కొట్టిపారేస్తుందని..16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తుందని ఉద్ధవ్ థాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేన రెబెల్ గ్రూప్ కన్పించకుండా పోతుందని స్పష్టం చేశారు. 

Also read: Adani Issue: అదానీ వ్యవహారంపై కేంద్రానికి షాక్, సీల్డ్ కవర్‌కు నో చెప్పిన సుప్రీంకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News