మద్యం విక్రయాలు.. మందు బాబులకు కండిషన్స్

లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.

Last Updated : May 5, 2020, 01:57 AM IST
మద్యం విక్రయాలు.. మందు బాబులకు కండిషన్స్

కోల్‌కతా : లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు.. అది కూడా ఒక్కో వ్యక్తికి రెండు మద్యం సీసాలను మాత్రమే విక్రయించాలని మమతా బెనర్జీ సర్కార్ షరతు విధించింది. 

Also read : మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే

లావాదేవీలు జరిపే సమయంలో దుకాణాదారులే వినియోగదారులకు శానిటైజర్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి లిక్కర్ అమ్మవద్దు. మద్యం కొనడానికి వచ్చిన వారు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత మద్యం దుకాణదారులదేనని పశ్చిమ బెంగాల్ సర్కార్ తమ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా తాజా ఎంఆర్పీ ధరల పట్టికను సైతం దుకాణం బయట ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది.

Also read : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు

మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచే మద్యం షాపులు తెరుచుకోగా.. మందుబాబులు సైతం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడ్డారు. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినెలా జనాలు వైన్ షాపుల వద్ద ఒకరిపై మరొకరు నిలబడటంతో పోలీసులు వారిని చెదగరొట్టి దుకాణాలు మూయించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News