Sharad Pawar: అమిత్ షాతో భేటీ కానున్న శరద్ పవార్, కారణం అదేనా

Sharad Pawar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడం విశేషం. ఇటీవలి వార్తలకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు ఈ భేటీ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 06:05 AM IST
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్
  • బీఎస్ఎఫ్ ఉత్తర్వులపై పెరుగుతున్న వివాదం, అభ్యంతరాలు
  • వివాదాస్పద బీఎస్ఎఫ్ ఉత్తర్వుల విషయంపైనే అమిత్ షాతో చర్చించనున్న శరద్ పవార్
Sharad Pawar: అమిత్ షాతో భేటీ కానున్న శరద్ పవార్, కారణం అదేనా

Sharad Pawar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడం విశేషం. ఇటీవలి వార్తలకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు ఈ భేటీ.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఒక్కమాటలో చెప్పాలంటే బీఎస్ఎఫ్(BSF). అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భారత భూభాగాలలో సరిహద్దు భద్రతా దళం అధికార పరిధిని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central government) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలిప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే గతంలో ఈ పరిధిలో కేవలం 15 కిలోమీటర్ల వరకే ఉండేది. ఇప్పుడు తాజా ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు ప్రకారం మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్ల వరకూ పనిచేసేందుకు బీఎస్ఎఫ్‌కు అధికారాలు ఉంటాయి.

ఈ కొత్త ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. ఇవి అమల్లోకి వస్తే తమ హక్కులకు భంగం కలిగే అవకాశముందనే వాదన విన్పిస్తోంది. స్థానిక పోలీసులతో సమానంగా బీఎస్ఎఫ్ కు అధికారాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈ అంశంపైనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar)..కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షాను కలిసి..ఆయన ఆలోచనల్ని తెలుసుకుంటానంటున్నారు శరద్ పవార్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పశ్చిమ బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం తీవ్రవాదం, సరిహద్దు చొరబాటు నేరాల్ని అదుపు చేసేందుకు కొత్త ఉత్తర్వులు ఉపయోగపడతాయని చెబుతోంది. ఈ నేపధ్యంలో అమిత్ షా(Amit shah)-శరద్ పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also read: Manmohan Singh health condition: మన్మోహన్ సింగ్‌కి డెంగ్యూ.. తాజా పరిస్థితిపై AIIMS ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News