PK and Sharad Meet: ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ మధ్య భేటీకు కారణమదేనా

PK and Sharad Meet: దేశంలో మరో కూటమి ఏర్పడనుందా..యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా. ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ రెండు సార్లు భేటీ కావడానికి కారణమిదేనా. అసలేం జరుగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2021, 08:50 PM IST
 PK and Sharad Meet: ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ మధ్య భేటీకు కారణమదేనా

PK and Sharad Meet: దేశంలో మరో కూటమి ఏర్పడనుందా..యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా. ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ రెండు సార్లు భేటీ కావడానికి కారణమిదేనా. అసలేం జరుగుతోంది.

దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant kishor) ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మరోసారి భేటీ అయ్యారు. అంతకుముందు జూన్ 11న శరద్ పవార్ ఇంట్లో కలుసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో ఈ ఇద్దరి మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ప్రశాంత కిశోర్‌లు ఇటీవలి కాలంలో రెండుసార్లు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణ భేటీ అని చెబుతున్నా..ఇద్దరి మధ్య వేరే చర్చ జరిగినట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్‌ను కలిసిన అనంతరం 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధుల్ని సమావేశానికి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశం కూడా శరద్ పవార్( Sharad Pawar) నివాసంలో జరగనుంది. 

ఈ పరిణామాల నేపధ్యంలో దేశంలో మూడవ ఫ్రంట్ (Third Front) ఏర్పాటు కానుందనే చర్చ ప్రారంభమైంది. యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ వేదిక ఏర్పాటుపై ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్‌లు చర్చించారని తెలుస్తోంది. ఇవాళ ప్రశాంత్ కిశోర్‌తో జరిగిన భేటీలో ఎన్సీపీ కీలక నేతలు హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే అంశంపై చర్చించారు. 

Also read: Delhi Corona Status: దేశ రాజధానిలో అత్యల్పంగా కరోనా కేసులు, పూర్తిగా తగ్గిన కరోనా ఉధృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News