Uddhav Thackeray: శివసేన పార్టీ, గుర్తు తమదే..శిండే ద్రోహం చేశారన్న ఉద్ధవ్ ఠాక్రే..!

Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. శివసేన రెబెల్స్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 8, 2022, 05:33 PM IST
  • మహారాష్ట్రలో హాట్ హాట్‌గా పాలిటిక్స్
  • శివసేన రెబెల్స్, బీజేపీ కలిసి ప్రభుత్వ ఏర్పాటు
  • శిండేపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
Uddhav Thackeray: శివసేన పార్టీ, గుర్తు తమదే..శిండే ద్రోహం చేశారన్న ఉద్ధవ్ ఠాక్రే..!

Uddhav Thackeray: మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్నారు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియాతో ముచ్చటించారు. శివసేన తమదేనని..ఎన్నికల గుర్తు విల్లు, బాణం తమకే చెందుతాయని స్పష్టం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ గుర్తును వాడుకోకూడదన్నారు. ఈనెల 11న 16 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుందని తెలిపారు.

ఆ తీర్పు శివసేనకే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే..ప్రజాభిప్రాయం బయటపడుతుందని స్పష్టం చేశారు. శివసేన, ఎన్నికల గుర్తు తమదేనంటూ సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గం ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభాపక్షంలో చీలికలు వస్తే.. రాజకీయ పార్టీ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

లెజిస్లేచర్ పార్టీ..రాజకీయ పార్టీ వేరు అని చెప్పారు ఠాక్రే. ఎన్నికల గుర్తు విషయంలో తమకు ఎలాంటి గందరగోళం లేదని..దీనిపై స్పష్టతతో ఉన్నామన్నారు. తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై క్లారిటీ ఇస్తామన్నారు. తనను బీజేపీ టార్గెట్‌ చేసిందని..గత రెండున్నరేళ్లుగా ఇదే జరుగుతోందని చెప్పారు. బీజేపీతో టచ్‌లో ఉండి పార్టీకి, తనకు శిండే ద్రోహం చేశారన్నారు ఠాక్రే.

Also read: PM Modi on Shinzo Abe: జపాన్‌ మాజీ ప్రధాని అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!

Also read: Raghu Rama Krishna Raju: తెలంగాణ హైకోర్టులో రఘురామ కృష్ణం రాజుకు షాక్..పిటిషన్‌ కొట్టివేత..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News