Pooja Hegde: పూజా హెగ్డే కాఫీ టైం.. స్టైలిష్ లుక్ తో బుట్ట బొమ్మ

Pooja Hegde: బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమా ఆఫర్లు అందుకోలేక పోయినా.. ఇంస్టాగ్రామ్ లో మాత్రం అందరిని తెగఅలరిస్తోంది..

1 /5

హిందీలో హృతిక్ రోషన్ తో మోహన్జాదారో సినిమా చేసి అక్కడ ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అయితే వెంటనే రామ్ చరణ్ తో రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

2 /5

కానీ ఈ జిల్ జిల్ జిగేలు రాణి అనే సాంగ్ లో కనిపించి.. అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. ఆశ్చర్యం కొద్దీ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా అవకాశాలు కూడా అందుకుంది.

3 /5

జూనియర్ ఎన్టీఆర్ తో ఈ హీరోయిన్ చేసిన అరవింద సమేత అలానే అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

4 /5

మరోపక్క హిందీ, తమిళంలో కూడా ఎన్నో ఆఫర్లు అందుకుంటూ వచ్చింది ఈ హీరోయిన్. కానీ గత రెండు సంవత్సరాలుగా మాత్రం వరుస ఫ్లాపులు రావడంతో ప్రస్తుతం తెలుగులో ఈమెకు ఆఫర్లు తగ్గాయి.  

5 /5

ఈ క్రమంలో పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం పెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.