Punjab Kings: పంజాబ్ గెలవడానికి ఆ సినిమానే కారణం.. మ్యాచుకు ముందు..! అసలు విషయం చెప్పేసిన స్మిత్‌!

Punjab players watched 14 peaks movie. పంజాబ్‌ ఇంతలా రెచ్చిపోయి ఆడదానికి ఓ సినిమా కారణమని 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఓడియన్‌ స్మిత్‌ తెలిపాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు పంజాబ్‌ ప్లేయర్స్ అందరూ '14 పీక్స్' అనే నేపాలీ ఇంగ్లీష్ మూవీ చూశారట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2022, 02:54 PM IST
  • పంజాబ్ గెలవడానికి ఆ సినిమానే కారణం
  • మ్యాచుకు ముందు 14 పీక్స్ మూవీ
  • అసలు విషయం చెప్పేసిన స్మిత్‌
Punjab Kings: పంజాబ్ గెలవడానికి ఆ సినిమానే కారణం.. మ్యాచుకు ముందు..! అసలు విషయం చెప్పేసిన స్మిత్‌!

Odean Smith reveals Punjab players watched 14 peaks movie Before Bangalore match: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి మరో ఓవర్ ఉండగానే 208 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఊహించని విజయాన్ని అందించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరలో షారుఖ్‌ ఖాన్ (24 నాటౌట్; 20 బంతుల్లో 1x 4ర్‌, 2x 6), ఒడియన్ స్మిత్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1x 4ర్‌, 3x 6) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 

206 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్‌ అగర్వాల్ (32), శిఖర్ ధావన్‌ (43), భానుక రాజపక్స (43) రాణించడంతో పంజాబ్ జట్టు 17 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓడియన్‌ స్మిత్ (2), షారుఖ్‌ ఖాన్‌ (12) ఉన్నారు. పంజాబ్‌ విజయానికి ఇంకా 18 బంతుల్లో 36 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో బెంగళూరు విజయం సాదిస్తుందని అందరూ అనుకున్నారు. ఇక్కడే స్మిత్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో మూడు సిక్సులు, ఓ ఫోర్ బాది 25 రన్స్ పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది. 19వ ఓవర్లో షారుఖ్‌ మిగతాపని పూర్తిచేశాడు. 

పంజాబ్‌ ఇంతలా రెచ్చిపోయి ఆడదానికి ఓ సినిమా కారణమని 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఓడియన్‌ స్మిత్‌ తెలిపాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు పంజాబ్‌ ప్లేయర్స్ అందరూ '14 పీక్స్' అనే నేపాలీ ఇంగ్లీష్ మూవీ చూశారట. 'నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్' అనే ట్యాగ్‌లైన్ ఉన్న ఈ మూవీ ఆటగాళ్లలో స్పూర్తిని రగిలించిందని చెప్పాడు. 7 నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ సినిమాను కోచ్ అనిల్ కుంబ్లే ప్రత్యేకంగా చూపించారని స్మిత్ తెలిపాడు. 14 పీక్స్ సినిమా ఇచ్చిన ఊపుతోనే భారీ టార్గెట్‌ను ఛేదించామని చెప్పాడు. 

ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద '14 పీక్స్' సినిమా తెరకెక్కిందింది. ఎవరెస్ట్, కాంచనగంగ, మకాలు, ధౌలాగిరి, నంగా పర్వత్ వంటి శిఖరాలు ఈ జాబితాలో ఉన్నాయి. అత్యున్నత పర్వాతాలను అధిరోహించే క్రమంలో ఎదురైన కష్ట, నష్టాలను సినిమాలో అద్భుతంగా చూపించారు. లీగ్ దశలో 14 మ్యాచులు ఆడనున్న నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లకు అనిల్ కుంబ్లే సినిమా చూపించారట. సినిమాల్లో లాగానే తాము కూడా 14 మ్యాచ్‌ల అవరోధాన్ని అధిరోహిస్తామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Also Read: Will Smith: భార్యపై జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప పగలగొట్టిన స్టార్ హీరో! కేసు నమోదు.. (వీడియో)!

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News