iQOO Neo 9S Pro Price: ఐకూ నుంచి అదిరిపోయే ఫోన్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి iQOO Neo 9S Pro గ్రాండ్ ఎంట్రీ!

iQOO Neo 9S Pro Price: అతి తక్కువ ధరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఐకూ నుంచి కొత్త మొబైల్ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 3, 2024, 12:54 PM IST
iQOO Neo 9S Pro Price: ఐకూ నుంచి అదిరిపోయే ఫోన్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి iQOO Neo 9S Pro గ్రాండ్ ఎంట్రీ!

 

iQOO Neo 9S Pro Price: ప్రముఖ టెక్‌ కంపెనీ ఐకూ నుంచి మరో మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను నియో 9S ప్రో మోడల్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌  స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2, డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలిపారు. అయితే ఐకూ కంపెనీ ఈ iQOO Neo 9 స్మార్ట్‌ఫోన్‌లను 2023 సంవత్సరం డిసెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మోడల్‌నే రీబ్రాండెడ్ వెర్షన్ iQOO Neo 9 Pro పేరుతో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

iQOO Neo 9S Pro స్పెసిఫికేషన్‌లు:
iqoo neo 9s ప్రో స్మార్ట్‌ఫోన్‌ V2339A మోడల్ నంబర్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు కూడా Google Play కన్సోల్ డేటాబేస్‌లో కనిపించాయి. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఐకూ కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే పలువురు టిప్‌స్టర్స్‌ ఈ మొబైల్‌కి సంబంధించిన స్పెషిఫికేషన్స్‌ను లీక్‌ చేశారు. అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన ఫోటో కూడా లీక్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ iQOO Neo 9 Pro మొబైల్‌ చైనాలో V2339A మోడల్ నంబర్‌తో చైనాలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ iqoo neo 9s ప్రో స్మార్ట్‌ఫోన్‌ బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన OLED ప్యానెల్ 1260x2800 పిక్సెల్‌ల 1.5K రిజల్యూషన్‌ సపోర్ట్‌ కలిగి డిస్ల్పేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది Android 14పై పని చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. ప్లే కన్సోల్ జాబితాలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ మే నెలలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐకూ నియో 9s ప్రో స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌ :
1. డిస్ప్లే:

6.78-అంగుళాల AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1300 nits పీక్ బ్రైట్‌నెస్
HDR10+ సపోర్ట్

2. కెమెరా:
50MP ప్రధాన కెమెరా (Sony IMX766 సెన్సార్)
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
16MP సెల్ఫీ కెమెరా

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

3. ప్రాసెసర్:
Qualcomm Snapdragon 870 5G SoC
8GB LPDDR5 RAM
128GB/256GB UFS 3.1 స్టోరేజ్

4. బ్యాటరీ:
4500mAh బ్యాటరీ
80W ఫాస్ట్ చార్జింగ్
65W వైర్‌లెస్ చార్జింగ్

5. ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
Wi-Fi 6E
Bluetooth 5.3
NFC
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ స్పీకర్లు
Hi-Res ఆడియో

6. ధర:
8GB + 128GB వేరియంట్ - రూ.34,999
12GB + 256GB వేరియంట్ - రూ.39,999

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News