Samsung Galaxy A55: 50MP, 32MP కెమేరాలతో 12జిబి ర్యామ్ Samsung Galaxy A55 ధర మరోసారి తగ్గింపు, ఎంతంటే

Samsung Galaxy A55: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ స్థానం చాలా ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మంచి నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే ధర కాస్త అటూ ఇటూ అయినా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారీగానే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఇదే శాంసంగ్ నుంచి కస్టమర్లకు శుభవార్త అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2024, 12:04 PM IST
Samsung Galaxy A55: 50MP, 32MP కెమేరాలతో 12జిబి ర్యామ్ Samsung Galaxy A55 ధర మరోసారి తగ్గింపు, ఎంతంటే

Samsung Galaxy A55: ప్రముఖ టెక్ కంపెనీ Samsungకు చెందిన Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ కంపెనీ అధికారికంగా ఈ ఫోన్ ధరను తగ్గించింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యం, 50  మెగాపిక్సెల్ కెమేరా కలిగిన సూపర్ ఫోన్ ఇది. 

Samsung Galaxy A55 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 2340×1080 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీనికితోడు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ Exynos 1480 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. సెక్యూరిటీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చారు. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన ఫోన్ ధర 45,999 రూపాయలుగా ఉంది. శాంసంగ్ అధికారిక స్టోర్‌లో 3000 డిస్కౌంట్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే మరో 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ కండీషన్, బ్రాండ్, మోడల్‌ను బట్టి ధర ఉంటుంది. అన్నీ బాగుంటే మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్‌పై ఏకంగా 20 వేలు కూడా తగ్గింపు ఉండవచ్చు.

Samsung Galaxy A55 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమేరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇందులో ఉండే 50 మెగాపిక్సెల్ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

Also read: Poco M6 Pro 5G: 12జీబీ ర్యామ్ 50MP కెమేరాతో Poco M6 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం 9 వేలకే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News