Telangana Covid 19 Cases: మళ్లీ విజృభింస్తోన్న కరోనా వైరస్.. తెలంగాణాలో కొత్తగా ఎన్ని కేసులంటే?

Telangana records 50 new cases of covid 19. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. బుధవారం 50 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 27, 2023, 05:53 PM IST
Telangana Covid 19 Cases: మళ్లీ విజృభింస్తోన్న కరోనా వైరస్.. తెలంగాణాలో కొత్తగా ఎన్ని కేసులంటే?

Telangana reports 50 new cases of Coronavirus: పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా మళ్లీ విజృభింస్తోంది. కొత్త కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, మహారాష్ట్ర, కేరళ సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.

దేశంలో కరోనా వైరస్ (India Coronavirus) యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 57,410. కరోనా నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,424గా నమోదైంది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.13 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉంది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా మహమ్మారి కొత్త కేసులు (Telangana Covid 19) ఎక్కువగానే నమోదవుతున్నాయి. బుధవారం 50 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 8,43,468కి చేరుకుంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,111లుగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,38,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.49%గా ఉండగా.. రికవరీ రేటు 99.47%గా ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 363 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం మొత్తం 5,813 మందికి కోవిడ్ -19 టెస్ట్ చేశారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటివరకు 3.87 కోట్ల మందికి కరోనా టెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జన సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కుల తప్పనిసరి అని, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని వైద్యులు చెపుతున్నారు.

Also Read: BCCI Contract: మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. జెమీమా, షఫాలీకి నిరాశే!  

Also Read: DC Player Woman: పూటుగా మద్యం సేవించి.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News