Weather Report: తెలంగాణ వాసుల‌కు శుభ‌వార్త చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌.. మ‌రో మూడు రోజులు పాటు వాన‌లు..

Weather Report: నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌తో స‌త‌మ‌త‌మైన తెలంగాణ వాసుల‌కు మొన్న‌టి వ‌ర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. కానీ మొన్న‌టి నుంచి తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాన‌ వాతావ‌ర‌ణ శాఖ  శుభ‌వార్త చెప్పింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 10, 2024, 07:24 AM IST
Weather Report: తెలంగాణ వాసుల‌కు శుభ‌వార్త చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌.. మ‌రో మూడు రోజులు పాటు వాన‌లు..

Weather Report: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాగల మూడు మ‌రో రోజులకు ప్ర‌త్యేకంగా వెద‌ర్ బులిటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ రోజు.. రేపు..  ఎల్లుండి వరకూ తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయి. దీంతో పాటుగా  గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  ఈ నెల 14 వరకూ ఇదే విధమైన తేమ‌తో కూడిన‌ వాతావరణం నెలకొంటుందని తెలిపింది.

ఇక రాగల 24 గంటలకు సంబంధించి ఏడు జిల్లాలకు ఆరెంజ్ అల‌ర్ట్  జారీ చేసింది..

యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , నాగర్‌ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావ‌ర‌ణ శాఖ‌ హెచ్చరించింది. మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ చేసింది. తెలంగాణ‌లో మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలకు ప్రత్యేక వాతావార‌ణానికి సంబంధించిన‌ బులిటిన్ విడుదల చేసింది. రాగల 24 గంటల పాటు సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

నగరం లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి జల్లులు కురిసే అవాకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలు , కనిష్టంగా 24 డిగ్రీలు, గాలి వేగం గంటకు 10 నుండి 40 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆ తర్వాత రాగల 48 గంటల్లో కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
బికనూర్‌లో 32.5 మి.మి వర్షం..రాష్ట్రంలో నిన్న బుధవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

అత్యధికంగా కామారెడ్డి జిల్లా బికనూర్‌లో 32.5 మిల్లీ మీట్ల‌ర్ వ‌ర్షం ప‌డింది. అటు దోమకొండలో 21 మి.మి వర్షం కురిసింది.. సంగారెడ్డి జిల్లా జరాసంధలో 26.5 మి.మి, సిద్దిపేట జిల్లా కట్కూర్‌లో 12.8 మి.మి. వర్షం కురిసింది. వికారాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు తదితర జిల్లాల్లో కూడ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి.

Also Read: Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న 'సినీ మద్దతు'.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News