Salaar2 Update: సలార్2 కి.. మొదటి భాగానికి తేడా అదే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Salaar 2 Update : వరుసడిజాస్టర్లతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమాతో మంచి హిట్ దొరికింది. కానీ ఈ సినిమా విషయంలో కూడా ప్రభాస్ కొన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సలార్ 2 లో మాత్రం అలాంటి ట్రోల్స్ రాకుండా ప్రశాంత్ నీల్ కొన్ని ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 06:34 PM IST
Salaar2 Update: సలార్2 కి.. మొదటి భాగానికి తేడా అదే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Salaar 2 Release Date : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కానీ ఓటీటీలో సినిమా విడుదలయ్యాక మాత్రం సినిమా మీద ట్రోల్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ కి డైలాగులే లేవని ఫాన్స్ కూడా కామెంట్లు చేశారు. 

ఈ సినిమా భారీకలెక్షన్లు సాధించింది కానీ సినిమా నచ్చని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ప్రభాస్ అభిమానుల్లో కూడా సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు.  దానికి ఉన్న బోలెడు కారణాల్లో ఒకటి ప్రభాస్ డైలాగ్స్ కూడా. సినిమాలో ప్రభాస్ గొంతు వినిపించడమే గగనం అన్నట్లు ఉంటుంది. సినిమా మొత్తం మీద ప్రభాస్ డైలాగులు రెండు నిమిషాల 33 సెకండ్లు మాత్రమే వినిపిస్తాయి అని చాలామంది దర్శకుడుపై మండిపడ్డారు. 

మూడు గంటల సినిమాలో ప్రభాస్ డైలాగులు కనీసం మూడు నిమిషాలు కూడా లేవు అంటూ సినిమా రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ ను సోషల్ మీడియాలో ఏకీపారేశారు. ఈ నేపథ్యంలో సలార్1 సినిమాలో జరిగిన ఈ తప్పుని సలార్ 2 సినిమా విషయంలో జరగకూడదని ప్రశాంత్ గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ సినిమాలో ప్రభాస్ కి భారీగానే డైలాగులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏదో పేరుకి డైలాగ్స్ ఇచ్చినట్లు కాకుండా ఈసారి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కొన్ని అదిరిపోయే పవర్ ఫుల్ డైలాగ్ లు కూడా చెప్పించబోతున్నారట. ఆ డైలాగులు వింటే అభిమానులు థియేటర్లలో ఈలలు వేయడం ఖాయం అని కొందరు చెబుతున్నారు. 

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సలార్ 2 లో అయినా ప్రభాస్ మంచి డైలాగ్స్ చెప్తే బాగుంటుంది అని అభిమానులు ముందు నుంచి అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఫాన్స్ హ్యాపీ అవుతారు అని చెప్పవచ్చు. 
 
సలార్ 2 సినిమా షూటింగ్ మే ఆఖరి నుంచి మొదలు కాబోతోంది అని చిత్ర బృందం ఈ మధ్యనే ప్రకటించింది. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ 10 రోజులపాటు జరగనుంది. సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి ఈ ఏడాది ఆఖరిలో సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Read more: Dk Aruna: రేవంత్ జూటా మాటలు మాట్లాడుతున్నారు.. పోలింగ్ వేళ ఫైర్ అయిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

Read more: Telangana Loksabha polls 2024: అయ్యో ఎంత ఘోరం.. ఎన్నికల విధుల్లో ఉండగా హర్ట్ ఎటాక్.. ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News