Dk Aruna: రేవంత్ జూటా మాటలు మాట్లాడుతున్నారు.. పోలింగ్ వేళ ఫైర్ అయిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 13, 2024, 03:15 PM IST
  • 69 జీవోపై పోరాటం చేశామన్న డీకే అరుణ..
  • అన్ని ఉచితాలు ఇవ్వడం మంచిది కారంటూ వ్యాఖ్యలు
Dk Aruna: రేవంత్ జూటా మాటలు మాట్లాడుతున్నారు.. పోలింగ్ వేళ ఫైర్ అయిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

Dk Aruna Fires on CM Revanth Reddy: పోలింగ్ కొనసాగుతున్న సమయంలో  సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో.. మోడీని తిట్టడం, రాజకీయాలు మాట్లాడటం  ఈసీ నిబంధలనలు తుంగలో తొక్కడమే అంటూ ఎద్దెవా చేశారు. ఈ విషయం పై ఇప్పటికే స్టేట్ ఈసీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక రాష్ట్రానికి సీఎం స్థాయిలో ఉంది కూడా..  ఈ విషయం తెలుసుకోకపోవడం అవగాహనా రాహిత్యమే అంటూ పంచ్ లు వేశారు. తాను.. గతంలో  గద్వాలకు ఎంతో చేశానని, నేను కొత్తగా చేయాల్సింది ఏమి లేదన్నారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికలలో గెలవగానే.. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానన్నారు. ఓటమి భయం తో రేవంత్ జూటా మాటలు, టైం పాస్ మాటలు మాట్లాడుతున్నారంటూ డీకే అరుణ విమర్శించారు.

Read more: TS Weather: పోలింగ్ రోజు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..

69 జీవో తెచ్చిందే సంగంబండ నుంచి జయమ్మ చెరువుకు నీళ్లు ఇవ్వాలన్నది మా తండ్రి కల అంటు గుర్తు చేశారు.  69 జీవో కోసం రేవంత్ ఎందుకు పోరాటాలు చేయలేదు, కొడంగల్ నుంచి హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయలేదని సెటైర్ లు వేశారు. కొడంగల్ ప్రజలు అమాయకులు.. అందుకే ఆయన అందరిని  బనాయిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే జూరాల నుంచి  పాలమూరు ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకునేలా అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.  ఇక.. కాంట్రాక్టు లు కమిషన్స్ కు రేవంత్ అలవాటు పట్టాడని,  60 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నతాము రేవంత్ రెడ్డి లాగా ఆలోచిస్తే.. ఈ దేశంలోనే కోటిశ్వరూలుగా ఉండేటోళ్ళమని సెటైర్ లు వేశారు.

మాట్లాడితే సారాయి దందాలు అన్నారు. ఆ రోజుల్లో  అది లీగల్, చట్ట పరంగా సరైనదే.. తాము ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు. ఈ జిల్లా కోసం Dk అరుణమ్మ చేసినంత పోరాటం కృషి ఎవ్వరు చేయలేదని అన్నారు.తాను గెలిస్తే కొడంగల్ రూపు రేఖలు మార్చేస్తా నని అన్నారు. ఇక్కడ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసేకెళ్ళలేకపోయామని అన్నారు.

Read more: CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ఈసారి బీజేపీ గెలిస్తే 30 లక్షల ఇల్లు కట్టించబోతున్నామని డీకే అరుణ అన్నారు. అన్ని ఉచితలపై డీకే అరుణమ్మ  సెటైరికల్ గా కాంగ్రెస్ కు చురకలు అంటించారు.  ప్రజలకు అన్ని ఫ్రీ ఇస్తామనదం అవసరమా..?.. ఓటుకు డబ్బు అని ప్రజల్ని అలవాటు చేయడం కరెక్ట్ కాదన్నారు. మెడికల్ కాలేజీ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్, గైడ్ లైన్స్ లేకుండా ఎలా ఇస్తారని రేవంత్ వ్యాఖ్యలను డీ కే అరుణ తిప్పికొట్టారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News