Loksabha Elections 2024: దక్షిణాదిన ముగిసిన ఎన్నికల ప్రక్రియ, 4వ దశలో 69 శాతం పోలింగ్

Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో విడత ముగిసింది. మొత్తం 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సరాసరిన 67.70 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు మినహా నాలుగో విడత ఎన్నికలు సజావుగా సాగాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2024, 08:32 AM IST
Loksabha Elections 2024: దక్షిణాదిన ముగిసిన ఎన్నికల ప్రక్రియ, 4వ దశలో 69 శాతం పోలింగ్

Loksabha Elections 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 96 స్థానాల్లో నిన్న మే 13న నాలుగో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. నిన్న జరిగిన నాలుగో విడతతో దక్షిణాదిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సంఘం తాత్కాలిక అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 67.70 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా మూడు దశల పోలింగ్ మాత్రమే మిగిలింది. నాలుగోదశలో 67.70 శాతం పోలింగ్ నమోదు కాగా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా  78.44 శాతం, జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 37.98 శాతం నమోదైంది. విశేషమేంటంటే గత కొన్ని దశాబ్దాల్లో జమ్ము కశ్మీర్‌లో ఇదే అత్యదిక పోలింగ్. 1996 తరువాత ఇదే అత్యదికంగా తెలుస్తోంది. ఉదయం నుంచే క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరారు. ఇక ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ ప్రజలు ఓటింగును బహిష్కరించారు. జార్ఘండ్‌లోని పశ్చిమ సింగ్బూమ్ జిల్లాలో పోలింగ్ అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భద్రతా బలగాలు ఈ ప్రయత్నాల్ని అడ్డుకున్నాయి. దేశంలోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 1717 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ వర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఏపీలో పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎక్కడా రీపోలింగ్ జరగడం లేదు. ఏపీలో 25 పార్లమెంట్, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 11, మహారాష్ట్రలో 11, మద్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో , ఒడిశా, జార్ఖండ్‌లో 4, జమ్ము కశ్మీర్‌లో 1 స్థానానికి ఎన్నికలు జరిగాయి.

నాలుగో విడత ఎన్నికల్లో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండాతో పాటు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ నేత మహువా మొయిత్రిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ టీఎంసీ తరపున కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరిపై పోటీ చేయగా కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్ను సిన్హా కూడా టీఎంసీ నుంచి బరిలో దిగారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేశారు. 

Also read: PM MOdi: పాక్ ను గాజులు తొడుక్కునేలా చేస్తాం.. ఎన్నికల ప్రచారంలో మోదీ స్ట్రాంగ్ ధమ్కీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News