యోగా ప్రపంచం ఎంతో ప్రాచూర్యం పొందింది. మీకు యోగాపట్ల ఆసక్తి, నైపుణ్యం ఉంటే మీకు చక్కటి ఆదాయ వనరుగా మారుతుంది. మీరు యోగా క్లాసులను ప్రారంభించి చక్కటి ఆదాయం పొందవచ్చు.
పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కార్పొరేట్ ఈవెంట్స్ ఏవైనా సరే ఫొటోగ్రఫీ లేకుండా ఊహించలేము. మీకు ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు.
మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆలస్యమెందుకు మీ ఇంట్లోనే క్లాసులు ప్రారంభించండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం మీ సొంతం అవుతుంది
మీకు ఓపిక, సహనం ఎక్కువగా ఉన్నట్లయితే చైల్డ్ కేర్ ప్రారంభించవచ్చు. మీ ఇంట్లో ఒక గదిని కేటాయిస్తే సరిపోతుంది. అయితే మీరు దీనికి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
మీకు వంట చేయడం ఇష్టమా. అయితే ఇంట్లోనే రకరకాల వంటకాలు రెడీ చేసి కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఇంట్లోనే కూర్చుండి రెండు చేతులా సంపాదించవచ్చు.
ఇ కామర్స్ పరిశ్రమలో మీరు గో డౌన్ లేద స్టోరేజీ హౌసులో ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండా ప్రొడక్టులును వస్తువులను విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుంది.
మీకు ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉంటే మీరు ఇంట్లోనే టైలరింగ్ వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ చుట్టుపక్కలవారికి చక్కటి దుస్తువులు కుడితే..మీ బిజినెస్ మరింత విస్తరించుకోవచ్చు.
మీ ఇల్లు రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంటే మీరు జ్యూస్ కార్నర్ పెట్టుకోవచ్చు. స్మూతీస్, ఫ్రెష్ జ్యూస్ , కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ వంటివి తయారు చేయవచ్చు.