మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఆందోళన చెందుతున్నారా, ఈ 5 పొరపాట్లే కారణం కావచ్చు

Md. Abdul Rehaman
Jun 26,2024
';


ప్రతి ఇంట్లో కరెంటుతో పనిచేసే గృహోపకరణాల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే కరెంటు బిల్లు కూడా పెరిగిపోతోంది.

';


అయితే మీరు చేసే 5 తప్పులు లేదా పొరపాట్లే మీ కరెంటు బిల్లును పెరగడానికి కారణమౌతోంది.

';

ఫ్యాన్, లైట్స్ ఆఫ్ చేయకపోవడం

చాలామంది గదిలోంచి బయటికొచ్చేటప్పుడు ఫ్యాన్, లైట్ ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. లేదా అదా వదిలేస్తుంటారు. కాస్సేపటి కోసమైనా సరే ఆఫ్ చేయడం మంచిది

';

ఫ్రిజ్ గోడకు ఆన్చి ఉంచడం

ఫ్రిజ్ అనేది సాధారణంగా ఎవరూ ఆఫ్ చేయరు. నిరంతరం పనిచేస్తుంటుంది. అయితే చాలామంది గోడకు ఆన్చి పెడుతుంటారు. దీనివల్ల కంప్రెసర్‌పై లోడ్ పెరిగి కరెంటు ఎక్కువ కాలుతుంది. అందుకే కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి

';

ఏసీ సెట్టింగ్

ఏసీ వినియోగించేటప్పుడు టెంపరేచర్ మరీ తక్కువ పెట్టకూడదు. దీనివల్ల కంప్రెషనర్‌పై లోడ్ పెరిగి విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

';


ఒకసారి గది చల్లబడ్డాక ఏసీ ఆఫ్ చేస్తుండాలి. దీనివల్ల కరెంట్ లోడ్ తక్కువ అవుతుంది.

';


ఏసీలను క్రమం తప్పకుండా సర్వీసు చేయించకపోవడం వల్ల కూలింగ్ సరిగా అవదు. దాంతో ఎక్కువసేపు రన్ చేయడం వల్ల కరెంటు ఎక్కువగా కాలుతుంది

';

టీవీ స్క్రీన్ ఆన్‌లో ఉంచడం

రాత్రిళ్లు టీవీ చూసిన తరువాత చాలామంది రిమోట్‌తో టీవీ ఆఫ్ చేసి వదిలేస్తుంటారు. టీవీ పవర్ ఆఫ్ చేయరు. దీనివల్ల కరెంటు బిల్లు ఎక్కువౌతుంది

';

ఇండికేటర్

కరెంటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇంట్లో ప్రతి గదిలో ఇండికేటర్ అమర్చుకుంటారు. ఇది కూడా కరెంటు ఎక్కువగా కాలడానికి కారణమౌతుంది

';

VIEW ALL

Read Next Story