అన్ని భాషల నుంచి పలు స్టార్ సెలబ్రిటీలు కీలక పాత్రలు పోషించిన కల్కి 2898 విడుదలకి సిద్ధం అయ్యింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1985లో గిరఫ్తార్ అనే హిందీ సినిమాలో కలిసిన నటించిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.
కల్కిలో బుజ్జి కార్ కోసం మహీంద్రా రీసెర్చ్.. వ్యాలీ టీం, జయం ఆటో ఇంజినీరింగ్ వారు కలిసి పని చేశారు. ఈ ఒక్క కారు కోసం నాలుగు కోట్లు ఖర్చయింది.
కమల్ హాసన్ ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.
చిత్ర బృందంలో ఎక్కువ వయసు ఉన్న నటుడు అమితాబ్ బచ్చన్. 81 సంవత్సరాలు ఉన్న బచ్చన్ ఈ సినిమాలో అశ్వద్ధాముడి పాత్రలో కనిపించనున్నారు.
సినిమాలో ఉండే మూడు విభిన్న ప్రపంచాలు: ఎలాంటి వనరులు లేని కాశి, కాంప్లెక్స్, శంబాల. వాటి కోసం 700 విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు.
సినిమా ట్రైలర్ లో ఒకరు 6000 సంవత్సరాల క్రితం ఉన్న పవర్ మళ్ళీ వచ్చిందంటే అని అంటారు. 2898 ఏడి నుంచి ఆరుగురు సంవత్సరాలు వెనక్కి వెళ్తే వచ్చేది 3102. అంటే కృష్ణ అవతారం ముగిసిన సంవత్సరం
దాదాపు 18 ఏళ్ల తర్వాత అందాల నటి శోభన.. ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సినిమా షూటింగ్ కోసం ఐమాక్స్ డిజిటల్ కెమెరాని వాడారు. యారి అలెక్స్ 65, యారి డిఎన్ఏ లెన్స్ వాడారు. 6.5 కే రెసెల్యూషన్ తో సినిమా తీయడం వల్ల ఐమాక్స్ కి సులువుగా అప్స్కేల్ చేసుకున్నారు
ఈ సినిమా 2డీ, 3డీ, ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మేట్ లలో విడుదల కాబోతోంది.