రతన్ టాటా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..
ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా.. డిసెంబర్ 28, 1937న బొంబాయిలో జన్మించారు.
రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చదివారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్‌మెంట్ కోర్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు.
రతన్ టాటా 1991లో టాటా గ్రూప్‌లో చేరారు. తన అనుభవంతో కంపెనీని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు.
రతన్ టాటా యొక్క స్మార్ట్ విధానంతో, కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.
రతన్ టాటా 1998లో టాటా మోటార్స్ ప్రారంభించడం ద్వారా భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలో చరిత్ర సృష్టించారు.
రతన్ టాటా ప్రజలకు చౌకధరలకు కార్లను అందించాలని కలలు కన్నారు, అందుకోసం దాదాపు 1 లక్ష ఖరీదు చేసే టాటా నానోను ప్రవేశ పెట్టారు.
టాటా గ్రూప్ యొక్క సోషల్ వెల్ఫేర్ 65% లాభాలను విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి స్వచ్ఛంద కార్యక్రమాలపై వెచ్చిస్తున్నారు.
దేశ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకు గాను రతన్ టాటాను భారతదేశ ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌లతో సత్కరించింది.