రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్విజ్ నిర్వహించనుంది.
ఆర్బీఐ RBI90Quiz ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ ను ప్రారంభించింది.
ఈ క్విజ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఈ క్విజ్ ఆర్బీఐ, ఆర్థిక పర్యావరణ వ్యవస్థ మధ్య మరింత అవగాహనను పెంపొందిస్తుందన్నారు.
క్విచ్ లో సాధారణ జ్నానానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మల్టీపుల్ ప్రశ్నలు ఉంటాయి.
బహుళస్థాయి పోటీ ఆన్ లైన్లో నిర్వహిస్తారు. స్థానిక, రాష్ట్రస్థాయిలో పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత జాతీయస్థాయిలో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది.
ఈ క్విజ్ లో మొదటి బహుమతికి రూ. 10 లక్షలు, రెండవ బహుమతికి రూ. 8లక్షలు, మూడవ బహుమతికి రూ. 6లక్షలు ఉంటుంది.
మండలస్థాయిలో మొదటి బహుమతి 5లక్షలు, రెండవ బహుమతి రూ. 4లక్షలు, మూడవ బహుమతి రూ. 3 లక్షలు ఉంటుంది.
మొదటి స్థానంలో నిలిచే వారికి రూ. 2లక్షలు, రెండో స్ధానంలో 1.5లక్షలు మూడో స్థానంలో లక్ష చొప్పున అందజేస్తారు.
సెప్టెంబర్ 1, 1999తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఏదైనా స్ట్రీమ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 17వరకు నమోదు చేసుకోవచ్చు.