టీ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో తెలిసిందే. టీ తాగుతూ ప్రపంచంలో ఏం జరుగుతుందో చర్చిస్తుంటారు. మీ గ్రామంలో టీ పాయింట్ ప్రారంభిస్తే చక్కటి ఆదాయం సంపాదించవచ్చు.
చాలా ఊర్లలో పిండివంటలు ఇష్టంగా తింటుంటూరు. పండగలు వచ్చాయంటే చాలు పిండి వంటలు చేస్తుంటారు. ఊరులోనే పిండిగిర్ని పెడితే మంచి లాభం ఉంటుంది.
చాలామంది ఊర్లలో పాల వ్యాపారం చేస్తుంటారు. ఇందులో మంచి ఆదాయం ఉంటుంది. అంతేకాదు నగరాలకు ఊర్ల నుంచి పాలు సప్లై అవుతుంటాయి. ఈ బిజినెస్ ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే లక్షాధికారులు అవుతారు.
ప్రతి ప్రాంతానికి ఆసుపత్రులు, క్లీనిక్ లు అందుబాటులో ఉండాలి. నేటికాలంలో రూజువారీ మందుల కోసం చాలా మంది ఫార్మసీలకు వస్తుంటారు. ఫార్మసీ ఏర్పాటు చేస్తే నమ్మదగిన ఆదాయ వనరుగా మారుతుంది.
రిటైల్ షాప్ అనేది బెస్ట్ బిజినెస్ ఐడియా. స్వీట్ షాపులు మంచి గుర్తింపు పొందుతున్నాయి. మంచి ఆదాయం ఆర్జించవచ్చు.
ఫౌల్ట్రీ పెంపకం అనేది తక్కువ పెట్టుబడితోపాటు శ్రమతో కూడినది. చిన్నతరహా పౌల్ట్రీ పెంపకం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.
పిండి మిల్లుల మాదిరిగానే సోయాబీన్స్, వేరుశనగ,ఆవాలనూనె తీసేందుకు ఆయిల్ మిల్లులను నిర్మించవచ్చు.
హాట్ చిప్స్, బనాన చిప్స్ అనేది ఈ మధ్య కాలంలో బెస్ట్ బిజినెస్ ఐడియాగా మారింది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. చాలామందిఇప్పుడు డైరెక్టుగా షాపుల్లో నుంచే కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా అల్లంవెల్లుల్లి పేస్ట్ తాజాగా రుబ్బి ఇస్తే మంచి లాభాలను పొందవచ్చు. చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.