ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం.
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా గ్లూకాన్ గుండె ఆరోగ్యానికి, జీర్ణఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ చేర్చుకోవాలి.
ఓట్స్ లో ఫైబర్ తోపాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమోతాదులో ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ, ఒత్తిడి, మంటను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
బ్రేక్ ఫాస్టులో ఓట్స్ ను చేర్చుకుంటే ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ కంటెంట్ గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ చాలా మంచిది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది.
ఓట్స్ లో అధిక ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గింది..గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఓట్స్ లో కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. ప్రీడయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషంట్లు ఓట్స్ చాలా మేలు చేస్తాయి.
ఓట్స్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ ఆరోగ్యానికి సంబంధించి ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.