పెట్రోల్ జీఎస్టీలోకి వస్తే లీటర్ ఎంతంటే..? మీరు అస్సలు ఊహించలేరు
Ashok Krindinti
Jun 20,2024
';
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్స్ ఉన్న విషయం తెలిసిందే.
';
ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌ను రూపొందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహిస్తోంది.
';
పెట్రోల్, డీజిల్ సహజ వాయువు, విద్యుత్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. ఎక్సైజ్ ట్యాక్స్‌ను తగ్గించాలని ఆర్థిక శాఖకు సీఐఐ సూచించింది.
';
ప్రస్తుతం అమలవుతున్న ట్యాక్స్ విధానాన్ని రద్దు చేసి.. పెట్రోలు, డీజిల్‌పై జీఎస్టీని అమలు చేస్తే లీటర్ ధర భారీగా తగ్గుతుంది.
';
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరపై కేంద్ర, రాష్ట్ర ట్యాక్సులు 55 శాతం వరకు ఉన్నాయి. గరిష్టంగా 28 శాతం జీఎస్టీ విధించినా.. తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభిస్తుంది.
';
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 94.72 రూపాయలుగా ఉంది. ఇందులో ఎక్సైజ్ ట్యాక్స్ రూ.19.90, డీలర్ కమీషన్ రూ.3.77, వ్యాట్ రూ.15.39 ఉంది.
';
ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లు 5%, 12%, 18%, 28% ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌లను గరిష్టంగా 28 శాతం స్లాబులో చేర్చినా.. తక్కువ ధరకే లభిస్తుంది.
';
ఒక అంచనా ప్రకారం.. డీలర్ ధర రూ. 55.66పై 28 శాతం జీఎస్టీ రిటైల్ రేటు దాదాపు రూ.72 అవుతుంది. దీనిపై డీలర్ కమీషన్ కలిపితే 75-76 రూపాయలకే పెట్రోల్, డీజిల్ లభిస్తుంది.